సంక్రాంతికి వస్తున్నాం.. ఒక్కో చోట ఒక్కోలా..
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. చైల్డ్ యాక్టర్ రేవంత్ మెయిన్ అట్రాక్షన్ గా నిలిచాడు.;
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. చైల్డ్ యాక్టర్ రేవంత్ మెయిన్ అట్రాక్షన్ గా నిలిచాడు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మేకర్స్ కు మంచి లాభాలు అందించింది. ముఖ్యంగా అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ సంపాదించుకుంది.
ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీ థియేటర్లలో రిలీజైన 46 రోజుల తర్వాత జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. జీ తెలుగు ఛానల్ టెలికాస్ట్ అయింది. అయితే జీ5 ఓటీటీలోకి ఎక్స్ ట్రా సీన్లతో మూవీ వస్తుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఓటీటీ వెర్షన్ రన్ టైమ్ కాస్త ఎక్కువగా ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి.
కానీ ఇప్పుడు ఓటీటీ వెర్షన్ లో ఎలాంటి ఎక్స్ ట్రా సీన్స్ లేవు. కాకపోగా.. 8 నిమిషాల వరకు రన్ టైమ్ తగ్గిపోయింది. కొన్ని సీన్స్ ను కట్ చేసినట్లు తెలుస్తుంది. ఎక్కువ రన్ టైమ్ తో వస్తుందనుకుంటే ఊహించని విధంగా నిడివి తగ్గిపోవడం గమనార్హం. దీంతో కొందరు సినీ ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్లలో సంక్రాంతి వస్తున్నాం మూవీ.. 2 గంటల 24 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అయింది. అదే సమయంలో ప్రేక్షకులను ఆకర్షించడానికి టీవీ వెర్షన్ లో గోదారి గట్టు పైనా పాట రెండుసార్లు ప్లే అయింది. దాని ద్వారా అభిమానులను ఎంటర్టైన్ చేశారు. అయితే ఓటీటీలో, టీవీలో ఒకేసారి ప్రత్యక్షమైంది మూవీ.
టీవీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న మూవీ.. ఇప్పుడు ఎంత టీఆర్పీ దక్కించుకుందో ఆసక్తికరంగా మారింది. త్వరలో ఆ వివరాలు బయటకు రానున్నాయి. మంచి టీఆర్పీ దక్కుతుందనే అంచనాలు మాత్రం ఉన్నాయి. మొత్తానికి సంక్రాంతి వస్తున్నాం.. టీవీలో ఒకలా.. ఓటీటీలో మరోలా.. థియేటర్లలో ఇంకోలా ప్రత్యక్షమైందనే చెప్పాలి. మరి దీని వెనుక కారణమేంటో మేకర్స్ కే తెలియాలి.