సూపర్‌ హిట్‌ మూవీ ఓటీటీలో వచ్చింది

ఇండియన్ ఆర్మీ మేజర్‌ దివంగత ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

Update: 2024-12-05 05:01 GMT

శివ కార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా రూపొంది దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అమరన్‌' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమరన్‌తో వచ్చిన క, లక్కీ భాస్కర్‌ సినిమాలు గత వారంలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అమరన్‌ సినిమాకు వసూళ్లు కంటిన్యూ కావడంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ను వాయిదా వేయడం జరిగింది. ఎట్టకేలకు అమరన్‌ సినిమాని ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌ మొదలు పెట్టింది. మరోసారి అమరన్‌ హిట్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇండియన్ ఆర్మీ మేజర్‌ దివంగత ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ముకుంద్‌ పాత్రలో శివ కార్తికేయన్‌ నటించగా, ఆయన భార్య పాత్రను సాయి పల్లవి పోషించారు. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా సాయి పల్లవి ఎమోషనల్‌ సీన్స్‌లో నటించిన తీరు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు రావడంతో పాటు దాదాపుగా రూ.350 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అమరన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ మొదలైంది.

తమిళ్‌లో రూపొందిన అమరన్‌ సినిమాను తెలుగు, హిందీ, కన్నడం, మలయాళంలో విడుదల చేయడం జరిగింది. అన్ని భాషల్లోనూ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హిందీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా భారీగా వసూళ్లు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌ చిత్రాల జాబితాలో ఈ సినిమా నిలిచింది. తమిళనాడులో ఈ సినిమా వివాదాలకు తెర తీసినా ప్రేక్షకులు మాత్రం భారీగా వసూళ్లు కట్టబెట్టారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోనూ అమరన్‌ సినిమాకు మంచి స్పందన దక్కుతోంది.

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల కాలంలో స్ట్రీమింగ్‌ అయిన సినిమాలతో పోల్చితే ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. దేవర సినిమా నాలుగు వారాలు అయినా టాప్‌ ట్రెండ్‌ అవుతున్నట్లుగా ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన విషయం తెల్సిందే. స్ట్రీమింగ్‌ అయ్యి 24 గంటలు పూర్తి కాకుండానే జాతీయ స్థాయిలో టాప్‌ ట్రెండ్‌ సినిమాల జాబితాలో అమరన్‌ నిలిచిందని నెట్‌ఫ్లిక్స్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమరన్ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో వీకెండ్‌ వరకు ఆగకుండానే అప్పుడే సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తూనే ఉన్నారు.

Tags:    

Similar News