ఓటీటీ : 4 నెలల ఎదురుచూపులకు తెర

సాధారణంగా ఫెయిల్యూర్‌ సినిమాలూ మూడు వారాల్లోనే ఓటీటీ ద్వారా వస్తున్నాయి. కనీసం నాలుగు వారాల్లో అయినా ఓటీటీ ద్వారా విడుదల కావాల్సి ఉంది.

Update: 2024-12-10 05:21 GMT

కోలీవుడ్‌ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్‌ ప్రధాన పాత్రలో పా రంజిత్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన 'తంగలాన్‌' సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ తో పాటు దేశ వ్యాప్తంగా విడుదల అయ్యింది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల అయిన ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చినా వసూళ్ల విషయంలో నిరాశ మిగిలింది. సినిమా తమిళనాడు మినహా ఎక్కడా భారీ వసూళ్లు సొంతం చేసుకోలేక పోయింది. సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ వ్యక్తం చేశారు. బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ అయిన తంగలాన్ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సాధారణంగా ఫెయిల్యూర్‌ సినిమాలూ మూడు వారాల్లోనే ఓటీటీ ద్వారా వస్తున్నాయి. కనీసం నాలుగు వారాల్లో అయినా ఓటీటీ ద్వారా విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం కోసం ఏకంగా నాలుగు నెలల సమయం పట్టింది. సినిమా యొక్క డిజిటల్‌ రైట్స్ కొనుగోలు చేసిన నెట్‌ ఫ్లిక్స్ వారితో నిర్మాతలకు ఆర్థికపరమైన విభేదాలు వచ్చాయని, అందుకే సినిమా స్ట్రీమింగ్‌కి ఇన్నాళ్ల సమయం పట్టిందని అంటున్నారు. ఎట్టకేలకు వివాదాలు అన్ని పరిష్కారం కావడంతో నెట్‌ ఫ్లిక్స్ ద్వారా సినిమా స్ట్రీమింగ్‌ మొదలు అయ్యింది.

ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది గుడ్‌ న్యూస్‌గా చెప్పుకోవాలి. ఈమధ్య కాలంలో చాలా మంది ప్రేక్షకులు సూపర్‌ హిట్ టాక్‌ వస్తేనే థియేటర్‌కి వెళ్లాలి అనుకుంటున్నారు. యావరేజ్ టాక్‌ వచ్చిన సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేస్తూ ఉంటారు. కనుక ఓటీటీ లో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ తమిళ సినీ వర్గాల వారితో పాటు, బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్‌ విభిన్నమైన నాలుగు పాత్రల్లో కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

విక్రమ్‌ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్‌, పార్వతి తిరువోతు, ముత్తు కుమార్‌, ప్రీతి కరానలు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతాన్ని జీవీ ప్రకాష్‌ కుమార్‌ అందించారు. సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఇక సినిమా సినిమాటోగ్రఫీకి సైతం మంచి స్పందన లభించింది. దర్శకుడు పా రంజిత్‌ ఇలాంటి ఒక కాన్సెప్ట్‌ను ఎంపిక చేసుకోవడం చాలా పెద్ద సాహస నిర్ణయం అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. గత చిత్రాలతో పోల్చితే పా రంజిత్‌ ఈ సినిమాలో మరింత అద్భుతంగా తన స్క్రీన్‌ప్లేను నడిపించారు.

Tags:    

Similar News