అక్కడ నో హైహీల్స్... ఈ దేశాల్లో పర్యాటకులకు ఇంట్రస్టింగ్ రూల్స్!

పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షించే ప్రదేశాలు, కట్టడాలు, సదుపాయాలు ఉండే దేశాల్లో.. రూల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి.

Update: 2025-01-16 22:30 GMT

పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షించే ప్రదేశాలు, కట్టడాలు, సదుపాయాలు ఉండే దేశాల్లో.. రూల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలో కొన్ని రూల్స్ షాకింగ్ గా ఉంటే.. మరికొన్ని సర్ ప్రైజ్ గానూ, మరికొన్ని సీరియస్ గానూ ఉంటాయని అంటారు. ఈ సమయంలో ఆసక్తికర రూల్స్ ఉన్న దేశాలు.. అక్కడున్న రూల్స్, అతిక్రమిస్తే పడే శిక్షలు ఏమిటనేది ఇప్పుడు చూద్దామ్!

మలేషియా:

టురిస్టులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో మలేషియా ఒకటి. ఇక్కడ పర్యాటకులకు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఇందులో భాగంగా... ఇక్కడ మీ సంభాషణలు కులం, మతం వంటి సున్నితమైన అంశాలకు దూరంగా ఉండాలి. ఇక్కడ మసీదుల్లో ప్రవేశించేటప్పుడు నిరాడంబర దుస్తులు ధరించాలి. రంజాన్ మాసంలో మద్యపానం, దూమపానం పబ్లిక్ గా చేయకూడదు.

ఇండోనేషియా:

ఇక్కడ మద్యపానం చేయడానికి అర్హత గల వయసు 21 సంవత్సరాలు కాగా.. రంజాన్ మాసంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేయకూడదు. ఇక పర్యాటకానికి బాగా ప్రసిద్ధి చెందిన బాలీలో టూరిస్టులకు ప్రత్యేకంగా టాక్స్ ఉంటుంది. ఇక్కడ డ్రగ్స్ వాడినా, సరఫరా చేసినా మరణశిక్ష విధిస్తారు. ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే.. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.

జపాన్:

ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో జపాన్ ఒకటి. ఇక్కడ అటు పురాతన దేవాలయాల ప్రశాంతతతో పాటు ఆధునిక నగరాల సందడీ కనిపిస్తుంది. ఇక్కడ దూమపానానికి ప్రత్యేకమైన ప్రదేశాలు ఏర్పాటు చేశారు. పబ్లిక్ ప్లేస్ లో పొగతాగితే లోపలేస్తారు. ఇక్కడ రెస్టారెంట్స్ లో టిప్స్ ఇచ్చే ఆచారం లేదు. దానికి బదులుగా సర్వీస్ ఛార్జెస్ వేస్తారు.

థాయిలాండ్:

ఈ దేశంలో డ్రగ్స్ వాడినా, రవాణా చేసినా మరణశిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. ఇక్కడ రాజును, రాజకుటుంబాన్ని ఎప్పుడూ అగౌరవపరచకూడదు. ఇక్కడ రాజుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే జీవితకాలం జైలుశిక్ష తప్పదు. ఇదే సమయంలో... థాయ్ వ్యక్తిని తలపై తాకకూడదు. ఇక్కడ ఆలయాల్లోకే కాదు.. ఎవరైనా ఇంటికి వెళ్లినా, షాప్ కు వెళ్లినా చెప్పులు / షూస్ బయటే విడిచిపెట్టాలి.

సింగపూర్:

సింగపూర్ లో పబ్లిక్ ప్లేస్ లో పొగతాగడం, బబుల్ గమ్ నమిలి ఉమ్మడం, పబ్లిక్ టాయిలెట్స్ ను అపరిశుభ్రం చేయడం, పొగాకు ఉత్పత్తులు నమలడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, షాపుల్లో దొంగతనాలు చేయడం వంటివాటికీ జరిమానాతో పాటు కఠినమైన శిక్షలు ఉంటాయి. రాత్రి 10:30 నుంచి ఉదయం 7 గంటల మధ్య.. లేదా, లిక్కర్ కంట్రోల్ జోన్ లలో బహిరంగంగా మద్యం సేవించడం చట్టవిరుద్ధం.

గ్రీస్:

గ్రీస్ దేశంలోని ఏథేన్స్ లోని ఆక్రోపోలిస్ తో సహా అనేక పురాతన ప్రదేశాలలో హీల్స్ అనుమతించబడవు. జాతీయ సంపద దెబ్బతినకుండా రక్షించడానికి అక్కడి అధికారులు 2009 నుంచి ఇక్కడ హై హీల్స్ ని నిషేధించారు. ఇక్కడ అధికంగా మద్యం సేవించినా, డ్రగ్స్ వాడినా, కలిగి ఉన్నా అరెస్ట్ చేస్తారు. ఇక్కడ సైనికులను ఫోటోలు తీయకూడదు.

Tags:    

Similar News