ఎవరెస్టే కాదు.. దాన్ని ఎక్కేందుకు కట్టే ఫీజూ ఆకాశాన్ని తాకుతుంది!

తాజాగా దాన్ని 15,000 డాలర్ లకు పెంచేసింది. అంటే.. గతంలో రూ.9.5 లక్షల ఉన్న ఫీజును రూ.13 లక్షలకు పెంచిందన్నమాట.

Update: 2025-01-24 02:45 GMT

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ గురించి దాదాపు తెలియని వారు ఉండరనే చెప్పాలి. సముద్ర మట్టానికి సుమారు 29,028 అడుగుల ఎత్తులో ఉండే ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు.. కొంతమంది సక్సెస్ అవుతుంటారు! అయితే.. ఈ శిఖరాన్ని అధిరోహించాలంటే శారీరక సత్తాతో పాటు ఆర్థికమైన స్థోమతా ఉండాలి. అయితే.. తాజాగా ఆ ఖర్చు పెంచేసింది నేపాల్ ప్రభుత్వం.

అవును... మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు శారీరక సత్తాతో పాటు ఆర్థికమైన స్థోమత కూడా ఉండాలనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎవరెస్ట్ ఎక్కేందుకు వచ్చే వారి నుంచి వసూలు చేసే ఫీజును తాజాగా నేపాల్ ప్రభుత్వం పెంచేసింది. ఇందులో భాగంగా.. ఒక్కసారిగా 36 శాంత పెంచి.. ‘మౌంట్ ఎవరెస్టే కాదు.. దాన్ని ఎక్కేందుకు చెల్లించాల్సిన ఫీజూ ఆకాశానికే’ అనే చర్చ తెరపైకి తెచ్చింది.

ఈ సమయంలో తాజాగా నేపాల్ సర్కార్ ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే విదేశీ అధిరోహకుల అనుమతి రుసుమును భారీగా పెంచేసింది. ఇందులో భాగంగా... ఇప్పటి వరకూ మార్చి - మే నెల మధ్య ఎవరెస్ట్ ఎక్కే పర్వతారోహకులకు 11,000 డాలర్లు వసూల్ చేస్తే... తాజాగా దాన్ని 15,000 డాలర్ లకు పెంచేసింది. అంటే.. గతంలో రూ.9.5 లక్షల ఉన్న ఫీజును రూ.13 లక్షలకు పెంచిందన్నమాట.

ఇక సెప్టెంబర్ – నవంబర్ మధ్యలో ఈ పర్వతాన్ని అధిరోహించాలనుకునే వారికి ఫీజును 5,500 డాలర్ల నుంచి 7,500 డాలర్లకు పెంచింది. అంటే... రూ.4.75 లక్షల నుంచి రూ.6.5 లక్షలకు పెంచింది. ఇక డిసెంబర్ - ఫిబ్రవరి మధ్య వింటర్ తో పాటు జూన్ - ఆగస్ట్ మధ్య రైనీ సీజన్ లో అధిరోహించాలనుకునే వారికి ఫీజును 2,750 డాలర్ల నుంచి 3,750 డాలర్లకు పెంచారు.

అంటే... రూ.2.37 లక్షల నుంచి రూ.3.24 లక్షలకు పెంచారు. ఈ పెంచిన ఫీజులు అన్నీ ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నట్లు నేపాల్ టూరిజం బోర్డు డైరెక్టర్ తెలిపారు. ఇదే సమయంలో.. పర్వతాన్ని నిర్వహించడం ఖరీదైన పనిగా మారిన నేపథ్యంలో రుసుములను పెంచాల్సి వచ్చిందని పర్యాటన శాఖ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు.

Tags:    

Similar News