ఎవరు ఈ తెలుగు సూపర్‌హీరో! ఏమిటి అతడి సాహసం?
మధురాశ్రీధర్ స్నేహగీతం చిత్రంతో కథానాయకుడిగా కెరీర్ ని ప్రారంభించాడు అరవింద్ కృష్ణ. టాలీవుడ్‌లో హీరోగా అరడజను పైగా చిత్రాల్లో నటించాడు.
మధురాశ్రీధర్ స్నేహగీతం చిత్రంతో కథానాయకుడిగా కెరీర్ ని ప్రారంభించాడు అరవింద్ కృష్ణ. టాలీవుడ్‌లో హీరోగా అరడజను పైగా చిత్రాల్లో నటించాడు. అరవింద్ కృష్ణ నటించిన తదుపరి చిత్రం A-మాస్టర్ పీస్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సూపర్ హీరోగా మారే యువకుడి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని తాజాగా రిలీజైన ప్రీటీజర్ వెల్లడిస్తోంది.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ట్విస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ హీరో చిత్రంగా ప్రచారం జరుగుతోంది. సుకు పూర్వాజ్ దర్శకరచయిత. పవర్-ప్యాక్డ్ టీజర్ సూపర్ పవర్స్ ఉన్న యువకుడి విజువల్స్‌తో ఆకట్టుకుంటోంది. కథాంశం గురించి పెద్దగా వెల్లడించకుండా అంచనాలను పెంచుతోంది టీజర్. అరవింద్ కృష్ణ ఈ చిత్రంలో సూపర్ హీరోగా నటించారు. సమాజంలో న్యాయం కోసం పోరాడే సూపర్ హీరోగా అతడు కనిపిస్తాడా? అన్నది వేచి చూడాలి. విలన్ గా మనీష్ గిలాడా ఆశ్చర్యపరిచాడు. హీరో విలన్ నడుమ వార్ రక్తి కట్టించనుందని అర్థమవుతోంది.
ఎ- మాస్టర్ పీస్ టైటిల్ కి తగ్గట్టే విజువల్ రిచ్ సినిమా అని టీజర్ వెల్లడించింది. నేపథ్య సంగీతం మరో అస్సెట్. సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ కాండ్రేగుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ప్రధాన తారాగణంలో అషు రెడ్డి, స్నేహా గుప్తా కథానాయికలుగా కనిపిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత వస్తున్న అరవింద్ కృష్ణకు విజయం దక్కుతుందనే ఆకాంక్షిద్దాం.