కుమార్తెని అలా చూసి గర్వపడిన హీరో!
తాజాగా 18 ఏళ్ల వయసున్న చిన్న కుమార్తె మైరా ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా( ఎఫ్ డీ సీఐ) నిర్వహించిన డియెర్స్ ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ లో తళుక్కున మెరిసింది.
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కి ఇద్దరు అందమైన కుమార్తెలున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో వారసులంతా ఎంట్రీ ఇస్తోన్న తరుణంలో రాంపాల్ డాటర్స్ ఎప్పుడొస్తున్నారు? అంటూ ఎప్పటికప్పుడు బాలీవుడ్ మీడియాలో కథనాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. డాటర్స్ ఇద్దరు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసినా..ఫోటోలు పెట్టినా రాంపాల్ తెగ సంరబడిపోతుంటాడు. వాటిని రీ ట్వీట్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటాడు.
తాజాగా 18 ఏళ్ల వయసున్న చిన్న కుమార్తె మైరా ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా( ఎఫ్ డీ సీఐ) నిర్వహించిన డియెర్స్ ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ లో తళుక్కున మెరిసింది. ఈ సందర్భాన్ని పురస్కరించు కుని అర్జున్ రాంపౌల్ ఎంతో సంబరపడ్డాడు.
ఒక్కసారిగా కుమార్తె ని ర్యాంప్ వాక్ పై చూసే సరికి అర్జున్ రాంపాల్ ఆనందానికి అవధుల్లేవ్. ఈ సందర్భంగా ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ చేసారు. 'ఈ రోజు నా అందమై న లిటిల్ ప్రిన్సెస్ తన మొదటి రన్‌వేలో నడిచింది. అది కూడా క్రిస్టియన్ డియోర్ కోసం.
ఆమె తన స్వంత మెరిట్‌తోనే ఇవన్నీ చేసింది. ఆడిషన్స్ నుండి ఫిట్టింగ్స్ వరకు అన్నీ తానై చూసుకుంది. నిజంగా నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది మైరా. రన్‌వేలో నా చిన్న కుమార్తెను అలా చూడటానికి నా రెండు కళ్లు సరిపోవడం లేదు' అని స్పందించారు. ఆ సమయంలో పక్కనే ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ కూడా ఉంది. ఆమె చప్పట్లు కొట్టి మైరాకి విషెస్ తెలియజేసింది.
దీంతో అర్జున్ రాంపాల్ పెద్ద కుమార్తె కంటే చిన్న కుమార్తె ఎంట్రీ బాలీవుడ్ లో వేగంగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెద్ద కుమార్తె మహికా లండన్ ఫిల్మ్స్ స్కూల్లో చదువుతోంది. సినిమా రంగానికి సంబంధించిన శాఖలపై పట్టు సాధిస్తుంది.
మైరా-మిహికా ఇద్దరు అర్జున్ రాంపాల్ ముందు భార్య మెహర్ జెస్సీకా కుమార్తెలు. అర్జున్ రాంపాల్ మొదటి వివాహమై 21 సంవత్సరాలు అవుతుంది. విబేధాలు కారణంగా 2019 లో విడిపోయారు.