'బ్రో' ట్రైలర్ ఆగయా.. మామఅల్లుళ్ల టైమ్ గేమ్!
సరిగ్గా ఇంకో ఆరు రోజుల్లో థియేటర్‌లు అన్ని దద్దరిల్లిపోతాయన్న సంగతి తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా ఆయన క్రేజ్‌తో ఫస్ట్ డే సందడే సందడి ఉంటుంది.
సరిగ్గా ఇంకో ఆరు రోజుల్లో థియేటర్‌లు అన్ని దద్దరిల్లిపోతాయన్న సంగతి తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా ఆయన క్రేజ్‌తో ఫస్ట్ డే సందడే సందడి ఉంటుంది. ఇక పాజిటివ్ టాక్ వస్తే .. బాక్సాఫీస్ బద్దలే. అర్థమైపోయి ఉంటది కదా.. అదే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'బ్రో' చిత్రం.
రిలీజైన టీజర్, సాంగ్స్ మెగా అభిమానులను అంతగా ఎట్రాక్ట్ అయితే చేయలేదు. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ ట్రైలర్ మీద పడింది. మామా అల్లుళ్లు కలిసి తొలిసారి నటించడంతో సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇక విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసి అభిమానుల్లో ఫుల్ జోష్ ను నింపారు.
'భస్మాసురుడు అని ఒకడు ఉండేవాడు తెలుసా? మీ మనుషులు అందరూ వాడి వారసులు. ఎవడి తల మీద వాడే పెట్టుకుంటాడు. ఎవ్వడికీ ఛాన్స్ ఇవ్వడు' అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత సాయి తేజ్ ను.. టైమ్ లేదు టైమ్ లేదు అంటూ చూపించారు. అతడి ప్రేయసిగా కేతికా శర్మను చూపించారు.
తేజ్... టైమ్ లేదు.. టైమ్ లేదు అంటూ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ను, ఆఖరికి ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసి.. జీవితంలో పరుగులు పెడుతూ జీవిస్తుంటాడు. అదే సమయంలో అతనికి రోడ్డు ప్రమాదం జరిగుతుంది. సరిగ్గా అప్పుడే అతడికి కాలం విలువ తెలియజేయడం కోసం టైమ్ దిగొస్తాడు. అతడే పవన్ కల్యాణ్.
ప్రతిదానికీ టైమ్ లేదంటావ్ కదా అదే నేను అంటూ పవన్ ను చూపించారు. ఓ రోడ్డు ప్రమాదం హీరో జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది? అనే కథాంశంతో సినిమాను తీర్చిదిద్దారని అర్థమవుతోంది. ఇక ప్రచార చిత్రంలో చివర్లో పవన్ మేనరిజం డైలాగ్ లు, హుషాలు తెప్పించే మార్క్ కామెడీ చేశారు. అయితే 'జల్సా' చిత్రంలోని ఐకానిక్ స్టెప్ ను పవన్ మరోసారి చేయడం హైలైట్ గా నిలిచింది.
ఇక తమన్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ఈ ప్రచార చిత్రం పవన్ మార్క్ మేనరిజం, సాయితేజ్ కామెడీ, ఎమోషనల్, ఫైటింగ్ సీక్వెన్స్ తో నిండి ఉంది. మరి ఈ చిత్రంతో మామఅల్లుళ్లు స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఇకపోతే ఈ చిత్రాన్ని యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించారు. ప్రియా ప్రకాశ్ వారియర్ మరో హీరోయిన్ గా నటించింది.