ఏపీలో ముక్కోణపు పోరు..బాబు రెడీ..?
ఏపీలో వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోరు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మారుతున్న రాజకీయం చూస్తే అదే నిజం అనిపిస్తోంది అంటున్నారు.
By: Tupaki Desk | 20 July 2023 5:16 PM GMTఏపీలో వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోరు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మారుతున్న రాజకీయం చూస్తే అదే నిజం అనిపిస్తోంది అంటున్నారు. అనూహ్యంగా రేసులోకి దూసుకుని వచ్చిన జనసేన ఇపుడు తొడకొట్టి సవాల్ చేస్తోంది. జనసేనకు వైసీపీ కూడా ప్రతి సవాల్ చేస్తూ కావాల్సినంత పొలిటికల్ స్కోప్ కి రంగం సిద్ధం చేస్తోంది.
ఈ నేపధ్యంలో ఏపీలో గ్రాండ్ ఓల్డ్ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ కూడా మారుతున్న రాజకీయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో పొత్తులు ఏ వైపు నుంచి ఎటు తిరిగినా తాము జనంలో ఉండాలని తదనుగుణంగా తమ రాజకీయానికి పదును పెట్టుకోవాలని టీడీపీ చూస్తోంది.
ఏపీలో జనసేనలో పెరిగిన రాజకీయ ఆశలు, దానికి ఊతమిస్తున్న బీజేపీ పోకడలను తెలుగుదేశం పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది అని అంటున్నారు. జనసేనతో బీజేపీతో పొత్తులు ఉంటాయని ఆ మధ్య దాకా టీడీపీ భావించింది. అయితే ఇపుడు మాత్రం కధ కొంచెం మారుతున్నట్లుగా ఉంది అని ఆ పార్టీలోనే చర్చకు వస్తోంది అంటున్నారు.
ఈ దశలో పొత్తులు కుదిరినా అది టీడీపీకి కడు భారంగా కూడా ఉండొచ్చు అని మరో మాట కూడా వినిపిస్తోంది. భారీ ఎత్తున సీట్లకు జనసేన బీజేపీ డిమాండ్ చేసినా పొత్తుల ప్రసక్తి ఉండదని అంటున్నారు. దాంతో ఎందుకైనా మంచిదని తెలుగుదేశం తన జాగ్రత్తలో తాను ఉంది అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీకి అయినా రెడీ కావాలని సర్వం సిద్ధం చేసుకుంటోంది అని అంటున్నారు.
ఒక వైపు నారా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. దానికి జనాల నుంచి మద్దతు బాగానే దక్కుతోంది. అదే టైం లో చంద్రబాబు కూడా జిల్లాల టూర్లకు శ్రీకారం చుడతారు అని అంటున్నారు. ఒక వైపు చూస్తే చంద్రబాబు పార్టీ కేంద్ర పార్టీ ఆఫీసులో నియోజకవర్గ స్థాయి సమావేశాలను సమీక్షలను నిర్వహిస్తున్నారు. అలా యాభై దాకా నియోజకవర్గాలలో సమీక్షలు పూర్తి అయ్యాయని అంటున్నారు.
మరో వైపు చూసుకుంటే ఇక మీదట జిల్లాలకు వెళ్ళి అక్కడే నియోజకవర సమీక్షలను నిర్వహించడం నాయకులు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం వంటి వాటి మీదనే టీడీపీ అధినేత ఫోకస్ చేస్తారు అని అంటున్నారు. ఇక గ్రామాల్లో పర్యటనలు ఉండేలా చంద్రబాబు చూసుకుంటున్నారు అని అంటున్నారు.
ఇటీవల వచ్చిన కొన్ని సర్వేలలో వైసీపీకి అర్బన్ ఓటింగ్ బాగా తగ్గిపోయింది అని అంటున్నారు. దాంతో వైసీపీకి పట్టు ఉన్న గ్రామీణ ప్రాంతాలోనే టీడీపీ టార్గెట్ చేసి అక్కడ గట్టిగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పల్లెలలో బస చేస్తూ ప్రజలతో కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటూ రాత్రికి ఒక కార్యకర్త ఇంట్లో నిద్ర చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు అని అంటున్నారు.
ఇలా కనుక చేస్తే బాగా క్లిక్ అవుతుందని, పల్లెలలో కూడా సైకిల్ జోరుగా ఎగిరేందుకు అవకాశం లభిస్తుంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే తెలుగుదేశం పార్టీలో ఇపుడు లోకేష్ పాదయాత్ర సగం పూర్తి అయింది. ఆయన పాదయాత్ర పూర్తి చేసేలోగానే చంద్రబాబు జిల్లాల టూర్లు పూర్తి చేస్తే ఎన్నికల నాటికి పార్టీ పూర్తి సన్నద్ధంగా ఉంటుందని అంటున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోరాటానికి సిద్ధపడుతోంది. ఇపుడు టీడీపీ కూడా ఒంటరి పోరుకు సిద్ధపడితే జనసేన బీజేపీ ఒక కూటమిగా వస్తే మాత్రం ఏపీలో భీకరమైన ముక్కోణపు పోరు సాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.