రెండు టికెట్ల గోల.. చంద్రబాబుకు సవాలే..!
టీడీపీని గట్టెక్కించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తు న్నారు
By: Tupaki Desk | 28 July 2023 8:32 AM GMTఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీని గట్టెక్కించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తు న్నారు. నిత్యం ఆయన ఏదో ఒకరూపంలో మీడియా ముందుకు వస్తున్నారు. ప్రజల మధ్యకు కూడా వెళ్తు న్నారు. ఇక, ఇతర కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. మొత్తానికి పార్టీని అధికారంలోకి తీసుకురావ డమే ధ్యేయంగా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పనిచేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. క్షేత్రస్థా యిలో మాత్రం ఇంకా పరిస్థితి మెరుగు పడినట్టు కనిపించడం లేదు.
పదే పదే నాయకులను కూడా చంద్రబాబు తరుముతున్నారు. దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే.. నాయ కుల మనసు ఒక విధంగా.. మనుషులు మరో విధంగా ఉన్నారనే చర్చ పార్టీలో సాగుతుండడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కించుకోవాలనే ఆకాంక్ష ఉండడం ఒక విధంగా తప్పేం కాదు.అయితే.. ఒకటికి రెండు టికెట్లు ఆశిస్తున్నవారితోనే ఈ చిక్కంతా వస్తోందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. అంతేకాదు.. దీనివల్ల క్షేత్రస్థాయిలోనూ పార్టీ పరగులు పెట్టడం లేదనేది ప్రధాన సమస్యగా మారింది.
విషయంలోకి వెళ్తే.. చాలా మంది నాయకులు సీనియర్లు అయిపోయారు. వీరంతా కొన్నేళ్ల తరబడి పార్టీలోనే ఉన్నారు. ఇప్పటికి పలు పదవులు కూడా దక్కించుకున్నారు. దీంతో ఇలాంటి వారికి చంద్రబాబు దగ్గర చనువు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి రెండేసి టికెట్లు ఇవ్వాలనేది వీరి డిమాండ్. అయితే.. కుటుంబానికి రెండేసి ఇచ్చుకుంటూ పోతే.. పార్టీ పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుందన్నది చంద్రబాబు ఆలోచన.
అలాగని టికెట్లు అడుగుతున్నవారిని కాదనలేరు. పోనీ.. కావాలని ఇవ్వలేరు. దీంతో ఈ విషయంపై కొంత క్లారిటీని బహిరంగంగానే వినిపించినా.. ఎన్నికల సమయం దగ్గరకు వస్తుండడంతో మరోసారి సీనియర్ల నుంచి ఒత్తిడి మొదలైంది. వీరిలో చింతకాయల అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, అశోక్‌గజపతి రాజు వంటి సీనియర్లు ఉన్నారు. దీంతో ఈ విషయంలో చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.