Begin typing your search above and press return to search.

కొడాలిని కొట్టే వారే లేరా...టీడీపీ సెర్చింగ్

కొడాలి నానిని ఓడించాలన్నది టీడీపీ పంతంగా ఉంది

By:  Tupaki Desk   |   28 July 2023 4:30 PM GMT
కొడాలిని కొట్టే వారే లేరా...టీడీపీ సెర్చింగ్
X

ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ నుంచి నాలుగు సార్లు గెలిచారు 2004లో ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పట్లో గుడివాడ రావి కుటుంబం చేతిలో ఉండేది. వారు వదులుకుని కొడాలికి చాన్స్ ఇచ్చారు. అలా తెలుగుదేశం నుంచి రెండు సార్లు గెలిచిన నాని వైసీపీ నుంచి మరో రెండు సార్లు గెలిచారు.

ఆయన 2024 ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఒక విధంగా నానికి ఈ ఎన్నికలు చివరికి అని అంటున్నారు. తాను ఈసారి గెలిచి 2029 నాటికి తమ వారసులకు చాన్స్ ఇచ్చి పక్కకు తప్పుకోవాలని భావిస్తున్నారు. గుడివాడలో ఎలా చూసుకున్నా కొడాలి హవాకు తిరుగులేదు. ఆయన్ని కొట్టే మొనగాడు అయితే ప్రత్యర్ధి పార్టీలలో కనిపించడం లేదు అని అంటున్నారు.

కొడాలి నానిని ఓడించాలన్నది టీడీపీ పంతంగా ఉంది. ఈసారి కనుక ఆయన్ని ఓడించకపోతే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ ఆనందం తమకు పూర్తి స్థాయిలో ఉండదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో చాలా మంది పేర్లను పరిశీలిస్తున్నారు.

అందులో ఎన్నారై గా ఉన్న వెనిగండ్ల రాము పేరు సీరియస్ గానే పరిశీలన చేశారు. ఆయన కమ్మ, సతీమణి ఎస్సీ కావడంతో రెండు సామాజిక వర్గాల కలయికతో నానికి దెబ్బ వేయవచ్చు అని ఒక లెక్క అయితే ఉంది. దాంతో 2014లో నాని మీద పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావుని పక్కన పెట్టారు.

అదే సమయంలో పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ, శిష్ట్లా లోహిత్ పేర్లను కూడా పరిశీలించారు. అయితే అటూ ఇటూ తిరిగి చివరికి రావి వైపే హై కమాండ్ మొగ్గు చూపిస్తోంది అని అంటున్నారు. వీరంతా కూడా కొడాలి నాని దూకుడుకు తట్టుకోలేరు అని అంటున్నారు. కొడాలి నాని మీద నిజానికి ఎవరిని నిలబెట్టినా ఓడిపోతారని టీడీపీ సొంత సర్వేలలో కూడా వచ్చిందని ప్రచారం సాగుతోంది.

కొడాలి నాని గడచిన నాలుగు ఎన్నికల్లో వరసగా గెలుస్తూ తన పట్టుని నిలుపుకుంటున్నారు. ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. అలాగే ఆయన క్యాడర్ తో కలసిపోతున్న తీరుతోనే అంతా ఆయన పట్ల ఫుల్ ఫేవర్ గా ఉంటున్నారు. కొడాలి నానిని ఓడించడం అంటే మాత్రం టీడీపీకి బిగ్ టాస్క్ గానే ఉంది అని అంటున్నారు.

దాంతో అన్నీ తిరిగి ఇపుడు గుడివాడ ఇంచార్జి గా ఉన్న రావి వెంకటేశ్వరరావు వైపే టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. మిగిలిన వారి కంటే కూడా రావికి గ్రామీణ ప్రాంతంలో బాగా పట్టు ఉందని, పైగా పార్టీలోకి వచ్చి ఎందరు బయటకు వెళ్ళిపోయినా రావి పార్టీని అట్టేపెట్టుకుని ఉన్న తీరుతోనే టీడీపీ పెద్దలు కూడా ఇంప్రెస్ అవుతున్నారుట.

దాంతో కొడాలిని ఓడించడం అన్నది సాధ్యం అయినా కాకపోయినా ఆయనకు పక్క బెదురు కలిగించే క్యాండిడేట్ అయితే లోకల్ గా ఉన్న రావి మాత్రమే అని టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది అని అంటున్నారు. దాంతో ఎన్నారై రాము ఆశలు నీరు కారినట్లే అని తెలుస్తోంది. కొడాలి నాని వర్సెస్ రావిగా గుడివాడ ఎన్నికలు మారబోతున్నాయి. 2014లో ఈ ఇద్దరూ తలపడ్డారు. పదేళ్ల తరువాత మరోసారి ఢీ కొట్టబోతున్నారు. విజేత ఎవరు అన్నది చూడాల్సి ఉంది.