Begin typing your search above and press return to search.

పిల్లి వారసుడికి లైన్ క్లియర్...మంత్రి వేణు సంగతి....?

ఇపుడు పిల్లి, తోటా ఒక్కటిగా రాజకీయం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మంత్రి వేణు ఒంటరి వారు అయ్యారు.

By:  Tupaki Desk   |   27 July 2023 3:53 AM GMT
పిల్లి వారసుడికి లైన్ క్లియర్...మంత్రి వేణు సంగతి....?
X

రాజకీయ రచ్చకు కేంద్ర బిందువుగా ఉన్న రామచంద్రాపురంలో వైసీపీ హై కమాండ్ ఇపుడు కీలక స్టెప్ తీసుకోబోతోంది అని అంటున్నారు. ఆఘమేఘాల మీద రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ని పిలిపించుకుని వచ్చి మరీ చర్చలు జరిపి కధను సుఖాంతం చేసుకుని హై కమాండ్. మరి అసలు ఏమి జరిగి ఉంటుంది. ఈ చర్చల వెనక ఏ హామీ ఉంది అన్నది అందరిలోనూ ఆసక్తిని కలిగించే విషయం

అయితే ప్రచారంలో ఉన్న దాని ప్రకారం చూస్తే రామచంద్రాపురం సీటుని పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్య ప్రకాష్ కి ఇచ్చేందుకు వైసీపీ అధినాయకత్వం అంగీకరించిందని అంటున్నారు. అదే టైం లో రామచంద్రాపురంలో పట్టు ఉన్న తోట త్రిమూర్తులుకు మండపేటలోనూ బలం ఉంది. దాంతో ఆయనకు మండపేట అసెంబ్లీ సీటు ఇస్తారని అంటున్నారు.

మండపేటలో 2014లో 2019లలో వైసీపీ ఓడింది. 2014లో గిరిజాల వెంకట స్వామి నాయుడు వైసీపీ నుంచి పోటీ చేస్తే 2019లో పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. అయితే ఇక్కడ కాపుల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. అందుకే తోట త్రిమూర్తులుని ఇక్కడ నుంచి పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఇప్పటికే ఇంచార్జిగా త్రిమూర్తులు అక్కడ యాక్టివిటీని చూస్తున్నారు అని అంటున్నారు

మరో వైపు చూస్తే రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ తోట త్రిమూర్తుల మధ్య దశాబ్దాల వైరం ఉన్నా వైసీపీ అధికారంలోకి వచ్చాక తోట త్రిమూర్తులు వైసీపీలోకి వచ్చారు. ఇపుడు పిల్లి, తోటా ఒక్కటిగా రాజకీయం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మంత్రి వేణు ఒంటరి వారు అయ్యారు. ఆయనకు 2019లో మంత్రి పిల్లి వర్గం పనిచేసి గెలిపించింది.

ఇపుడు ఆ వర్గం దూరం కావడంతో వేణుకు టికెట్ ఇస్తే ఓటమి పాలు అవుతారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పిల్లి కుమారుడికి టికెట్ ఇస్తే తోట వర్గం కూడా సహకరిస్తుంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో మంత్రి వేణుకు ఎమ్మెల్సీ ఇచ్చి పిల్లి కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని అంటున్నారు అలాగే తోటకు మండపేట టికెట్ ఇస్తే రెండు సీట్లూ వైసీపీ ఖాతాలో పడతాయన్నది ఆ పార్టీ వ్యూహంగా ఉంది.

మరి మంత్రి వేణు ఎమ్మెల్సీగా అంగీకరిస్తారా ఆయన ఈ ప్రపోజల్ కి ఓకే చెబుతారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా రామచంద్రాపురంలో జనసేన టీడీపీ కలసినా తమదే విజయం అని లేటెస్ట్ సర్వే వైసీపీకి ఉత్సాహం ఇస్తూంటే నాయకుల మధ్య వర్గ పోరు మాత్రం కలవరపెడుతోంది. అయితే ఇపుడు ఫుల్ క్లారిటీతోనే వైసీపీ ఈ రకమైన సర్దుబాటు చేస్తోంది అని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.