ఏపీ గురించి అంత బాధెందుకు మంత్రివర్యా..!
పోలవరం విష యంలో మంత్రి షెకావత్ ఏపీ గురించి నైరాశ్యంగా మాట్లాడారు
By: Tupaki Desk | 25 July 2023 6:39 AM GMT"ఏపీ గురించి మాట్లాడాలంటేనే బాధగా ఉంది" అని కేంద్ర మంత్రి షెకావత్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు.. ఫైరవుతున్నారు. ఏపీ గురించి అంత బాధెందుకు మంత్రివర్యా!? అని నిలదీస్తున్నా రు. కేంద్రం సకాలంలో స్పందించి ఉంటే.. నిజానికి ఏపీకి ఈ సమస్యలు ఉండేవి కాదు కదా! అని ప్రశ్నిస్తు న్నారు. ''ఇవ్వాల్సినవి ఇవ్వరు. చేయాల్సినవి చేయరు. కానీ, పార్లమెంటులో మాత్రం డ్యామేజీ మాటలు మాట్లాడతారు!" అని వైసీపీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు.
పార్లమెంటులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. పోలవరం విష యంలో మంత్రి షెకావత్ ఏపీ గురించి నైరాశ్యంగా మాట్లాడారు. అయితే. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉండడంతో వైసీపీ నాయకులు వెంటనే రియాక్ట్ అయ్యారు.
అంత బాధ ఎందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరగాల్సినవి జరుగుతున్నాయని.. కరోనా సమయంలోనే ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ రాలేదని చెబుతున్నారు.
కేంద్రం నుంచి విభజన హామీల్లో ఒక్కటి కూడా సరిగా అమలు కాలేదని, పోలవరం విషయంలో సవరించి న బడ్జెట్‌ను ఆమోదిస్తే.. నిర్మాణం ఇంత ఆలస్యం అయ్యేదా? అని నిలదీస్తున్నారు. అధికారంలో ఉన్న వారు ఏపీకి చేయాల్సింది చేయకుండా.. ఏదో నిమిత్త మాత్రంగా వ్యవహరిస్తూ.. రాష్ట్రం ముందుకు సాగడం లేదనిచెప్పడం భావ్యమా? అనేది వైసీపీ మాట.
అంతేకాదు.. విశాక ఉక్కు పరిశ్రమను ఎవరు ప్రైవేటు పరం చేయమన్నారు? దీనిని ఆపే ప్రయత్నం చేస్తే.. ఏపీ బాగానే ఉంటుందికదా! అంటున్నారు.
ఇక, కడప ఉక్కు పరిశ్రమను నిర్మించాల్సిన బాధ్యత విభజన చట్టం ప్రకారం కేంద్రంపైనే ఉందని,, కానీ, దీని నుంచి కూడా సర్కారు పక్కకు తప్పుకొందని ఇది చేస్తే బాగానే ఉంటుంది కదా! ఇలాంటి అనేక సమస్యలను గాలికి వదిలేసి, ఇప్పుడు ఏపీ ఏదో బాగోనట్టు.. మణిపూర్ అయినపోయినట్టు.. వగర్చడం ఏమేరకు సమంజసం మంత్రివర్యా? అని ప్రశ్నిస్తున్నారు.