Begin typing your search above and press return to search.

ఐఐటీ విద్యార్థి అదృశ్యం ఘటన.. విషాదాంతం!

హైదరాబాద్‌ లో ఐఐటీ చదువుతున్న దనావత్ కార్తిక్ నాయక్

By:  Tupaki Desk   |   25 July 2023 6:07 AM GMT
ఐఐటీ విద్యార్థి అదృశ్యం ఘటన.. విషాదాంతం!
X

హైదరాబాద్‌ లో ఐఐటీ చదువుతున్న దనావత్ కార్తిక్ నాయక్ ఈ నెల 17న సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి క్యాంపస్ నుంచి అదృశ్యం అయిన సంగతి తెలిసిందే. 20వ తేదీ ఉదయం జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఎక్కి సాయంత్రానికి విశాఖ చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ అదృశ్యం ఘటన విషాదాంతమైంది. ఐఐటీ చదువుతున్న కొడుకు అదృశ్యమయ్యే సరికి ఆ తల్లితండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది!

అవును... ఐఐటీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌) విద్యార్థి కార్తీక్‌ (21) అదృశ్యం ఘటన విషాదాంతమైంది. కార్తీక్‌ విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి మృతదేహం కేజీహెచ్‌ కు తరలించారు. దీంతో కార్తీక్‌ తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

కాగా... దనావత్ కార్తిక్ నాయక్ ఈ నెల 17న సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి క్యాంపస్ నుంచి అదృశ్యం అయ్యాడు. రెండు రోజుల పాటు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చి హాస్టల్ వార్డెన్ కు ఫోన్ చేశారు. దీంతో ఆ వార్డెన్ వెంటనే హాస్టల్ లో తనిఖీ లు చేయగా కార్తిక్ ఆచూకి ఎక్కడా కనపడలేదు.

దీంతో కంగారు పడ్డ తల్లితండ్రులు 19వ తేదీ ఐఐటీ కళాశాలకు వచ్చి ఫిర్యాదు చేయడం తో హాస్టల్ వార్డెన్ స్థానిక కంది పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు 20వ తేదీ ఉదయం జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఎక్కి సాయంత్రానికి విశాఖ చేరుకున్నట్లు గుర్తించారు.

దీంతో స్థానిక పోలీస్ సిబ్బందిని వెంటబెట్టుకుని తల్లితండ్రులు విశాఖ చేరుకున్నారు. ఈ సమయంలో నాయక్ నైట్స్ ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడో తెలియడం లేదు కానీ.. పగలు మాత్రం అవసరం వచ్చినప్పుడు మొబైల్ స్విచ్ ఆన్ చేసి, ఫుడ్ కోసం యూపీఐ పేమెంట్ చేసి అనంతరం వెంటనే స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాడట.

ఎప్పటికప్పుడు ట్రాక్ చేసున్న సంగారెడ్డి పోలీస్ కు వెంటనే బిల్ కడుతున్న బేకరీ, రెస్టారెంట్ లకు వెళ్తున్నా అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతున్నాడు కార్తీక్. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో అతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్ లో అతడు శవమై కనిపించాడు.

కొడుకు ను చూడాలని.. అసలు ఎందుకు పారిపోయాడో తెలుసుకోవాలని.. ఆ సమస్యను పరిష్కరించాలని కంటి నిండా నీరు పెట్టుకుని తల్లడిల్లిపోతున్న తల్లితండ్రులకు కార్తిక్ శవమై కనిపించాడు. దీంతో ఆ తల్లితండ్రుల ఆవేదన వర్ణణాతీతంగా ఉంది!

అయితే విశాఖ ఆర్కే బీచ్ లో కార్తీక్ ఆచూకీ దొరికేసరికి అతడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని తెలుస్తుంది. పోలీసులు కార్తీక్ సెల్‌ ఫోన్‌ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇతని స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ట్యాంక్ తండా.

అయితే బీటెక్ ద్వితీయ సంవత్సరంలో రెండు సబ్జెక్టుల్లో కార్తిక్ ఫెయిల్ అయినట్లు సమాచారం. అయితే ఆయన ఆత్మహత్యకు పరీక్షల్లో ఫెయిల్ అవ్వడమే కారణమా.. లేక, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం!