Begin typing your search above and press return to search.

టీడీపీ జనసేనల లో వైసీపీ కోవర్టులు...?

అయితే ఇపుడు ఒక కొత్త డౌట్ ని ఏకంగా సొంత పార్టీ మీదనే పెట్టారు రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు. అంతే కాదు ఏ విపక్ష పార్టీ వేయనంత పెద్ద బండను వేసారు.

By:  Tupaki Desk   |   18 July 2023 10:28 AM GMT
టీడీపీ జనసేనల లో వైసీపీ కోవర్టులు...?
X

వైసీపీ అధికార పార్టీ. దానికంటూ ఒక పార్టీ యంత్రాంగం వ్యవస్థ ఉంది. అలాగే అపొజిషన్ లో ఉన్న టీడీపీ సంస్థాగతంగా బలమైన పార్టీ. ఆ పార్టీకి పటిష్టమైన వ్యవస్థ ఉంది. జనసేన పార్టీ నిర్మాణం ఇంకా పెద్దగా లేదు కానీ పవన్ ఫ్యాన్స్ ఆ పార్టీకి స్ట్రాంగ్ బేస్ గా ఉంటారు. అందుకే ఈ మూడు పార్టీలు ఏపీ లో ఏ కార్యక్రమం చేపట్టిన ఫుల్ గా సక్సెస్ అవుతాయి.

ఏ పార్టీకి ఆ పార్టీకే అభిమానులు అనుచరులు ఉన్నారు. వారి మధ్యన వేరే పార్టీ వారు దూరేందుకు విభీషణ పాత్ర పోషించేందుకు చోటు ఉండదు, అది లాజిక్ గా చూసినా అందరికీ అర్ధం అయ్యేదే. అయితే ఇపుడు ఒక కొత్త డౌట్ ని ఏకంగా సొంత పార్టీ మీదనే పెట్టారు రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు. అంతే కాదు ఏ విపక్ష పార్టీ వేయనంత పెద్ద బండను వేసారు.

టీడీపీ జనసేనల లో వైసీపీ కోవర్టులు ఉన్నారంటూ ఒక రకంగా బాంబు పేల్చారు రాజుగారు. ఆయన అంతా చూసినట్లుగానే చెప్పుకొచ్చారు. ఇది నిజమో అబద్ధమో లేక అపోహ అనుమానమో తెలియదు కానీ బాగా అతుక్కునట్లుగానే బండ వేసి పడేసారు. ఇంతకే ఆయన అన్నదేంటి అంటే తెలుగుదేశం జనసేనల లో ఉన్న వైసీపీ కోవర్టులు రెండు పార్టీల మధ్య పొత్తు చెడిపోవాల ని కోరుకుంటున్నారుట.

అంతే కాదు రెండు పార్టీలు ఒక్కటి కాకూడదని విశ్వ ప్రయత్నం చేస్తున్నారుట. అలా జరిగి తేనే ఏపీ లో వైసీపీకి మేలు అని భావించి ఆ విధంగా కోవర్టులుగా రెండు పార్టీల లో ఉన్న వారు టీడీపీ జనసేనల మధ్యన దూరం బాగా పెరిగేలా చూస్తున్నారు అని ఆయన అంటున్నారు.

వీరంతా వైసీపీ మేలు కోరుతూ టీడీపీ లో జనసేన లో రహస్యంగా పనిచేస్తున్నారు అని మరో కొత్త మ్యాటర్ చెప్పారు. చంద్రబాబు పవన్ ల మధ్య ఉన్న బంధాని స్నేహాన్ని విడదీయాల ని చూస్తున్నారు అని ఆరోపిస్తున్నారు.

ఆయన న్యూఢిల్లీ లో మాట్లాడుతూ ఈ రకమైన బోల్డ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు, టీడీపీ జనసేన పొత్తు వల్ల ఆ రెండు పార్టీల కు ఇబ్బంది అంటూ రకరకాలైన ప్రచారం చేయడం వెనక వైసీపీ కోవర్టులే ఉన్నారని రాజు గారు అంటున్నారు.

రాజు గారి ఈ రకమైన స్టేట్మెంట్స్ రెండు ప్రాంతీయ పార్టీల తోనే ఆగిపోలేదు. జాతీయ పార్టీ బీజేపీ ని కూడా వైసీపీ కో వర్టులు పొత్తులకు దూరం చేస్తున్నారు అని అంటున్నారు. బీజేపీ లో ఉన్న కొన్ని ఇతర శక్తులు టీడీపీ జనసేన బీజేపీ ల పొత్తుల కు కుదరనీయడం లేదు అని అంటున్నారు.

నిజంగా బీజేపీ లో అలా జరుగుతుందా బీజేపీ అంటేనే మోడీ, అమిత్ షాగా చెబుతారు. అంత పటిష్టంగా ఆ పార్టీ ఉంటుంది. అక్కడ ఇతర శక్తుల జోక్యం ఎంతమేరకు పనిచేస్తుంది అన్న ఆలోచన కూడా లేకుండా రాజు గారు ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారా అన్నదే చర్చగా ఉంది మరి.

ఇదిలా ఉంటే పవన్ మాత్రం తన స్టాండ్ ఎప్పటికీ మార్చుకోలేదని, వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చనివ్వను అన్న తన మాటల కు ఆయన కట్టుబడి ఉన్నారని రాజు గారు మరో వైపు గట్టి భరోసా ఇస్తున్నారు. మరి కోవర్టులు ఉన్నారు. వారు పొత్తులను చెడగొడుతున్నారు అని ఒక వైపు చెబుతూ మరో వైపు పవన్ స్టాడ్ మారలేదు పొత్తులు ఖాయమని రాజు గారు చెప్పడేమే ట్విస్ట్ అంటే.

అయినా రాజకీయ గండరగండ చంద్రబాబు కూడా తన పార్టీలో కోవర్టులు ఉన్నారని అనుమానపడలేదు, ఆ పార్టీ నేతలు ఎవరూ అనలేదు,కానీ రాజు గారు మాత్రం ఈ సీక్రెట్ ని కనిపెట్టి చెప్పడమే విశేషం. మరి అలా జరుగుతోందా. ఏమో రాజు గారి డౌట్లు ఎపుడూ సంచలనం గానే ఉంటాయి మరి.