ఇక, తాడో పేడో.. అన్నింటికీ సిద్ధమయ్యారా..?
ముఖ్యంగా పవన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని తెలిసిన తర్వాత.. సీఎం జగన్ అలెర్ట్ అయ్యారని.. ఈ క్రమంలోనే పవన్ పై విరుచుకుపడుతున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 26 July 2023 1:21 PM GMTఅవును.. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే.. వైసీపీ నాయకులు ఇదే చెబుతున్నారు. ''ఇక, తాడే పేడో తేల్చుకు నేందుకు రెడీ అయ్యారు!'' అని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు కూడా.. సీఎం జగన్ ఎక్కడ ఏ సభ పెట్టినా ఆ కార్యక్రమం వరకు మాత్రమే పరిమితం అయ్యారు. దానికి సంబంధించిన విషయాలను మాత్రమే ఆయన మాట్లాడేవారు. కానీ, ఇటీవల కాలంలో రెండు నెలలుగా ఆయన వ్యూహాలు మారిపోయాయి. మీరు రెండంటే.. నేను నాలుగంటా..! అనే శైలిని అవలంబిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే అటు టీడీపీ, ఇటు జనసేనలపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేస్తున్నారని వైసీపీ నాయ కులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జనసేన దూకుడు పెరిగింది. ఇక, రెండున్నరేళ్లుగా టీడీపీ కూడా దూకుడుగానే ఉంది.
అయితే.. జనసేన దూకుడు పెరిగిన తర్వాత.. టీడీపీ కూడా ఆ పార్టీకి సమాంతరంగా వ్యాఖ్యలు చేస్తుండడంతో సీఎం జగన్ అలెర్ట్ అయ్యారని అంటున్నారు. దీంతో ఆయన ఏదైతే అదే అవుతుందనే నిర్ణయాలకు వచ్చేశారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
కొన్నాళ్ల కిందటి పరిస్థితిని గమనిస్తే.. జనసేన అధినేత పవన్ ఏమన్నా కూడా.. ఇతర మంత్రులు.. నాయ కులు ముఖ్యంగా కాపు నేతలు రంగంలోకి వచ్చేవారు తప్ప.. సీఎం జగన్ ఎక్కడా స్పందించేవారు కాదు. కానీ, పవన్ వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయని గ్రహించిన తర్వాత.. ముఖ్యంగా పవన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని తెలిసిన తర్వాత.. సీఎం జగన్ అలెర్ట్ అయ్యారని.. ఈ క్రమంలోనే పవన్ పై విరుచుకుపడుతున్నారని అంటున్నారు.
అదే సమయంలో టీడీపీపైనా జగన్ విమర్శలు చేస్తున్నారు. టీడీపీని విమర్శిస్తే.. ఒక వర్గం ఓట్లు పోతాయని తెలిసినా.. వాటిపై ఆశలు వదిలేసుకున్నారని అంటున్నారు. ఇక, పవన్ ఏమన్నా కూడా.. మౌనంగా ఉన్నారు. కాపు ఓట్లపై ప్రభావం పడుతుందనేదే దీనివెనక కారణం.
అయితే.. ఇప్పుడు పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆ ఒక్క వర్గంపైనే కాకుండా.. ఇతర వర్గాలపైనా పడుతోందని గ్రహించిన దరిమిలా జగన్ తాడేపేడో ఏదైతే అదే అవుతుందని భావించి.. తాను కూడా బరి దాటేస్తున్నారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.