Begin typing your search above and press return to search.

క్యారెక్టర్ లేనివాళ్ల క్యారెక్టర్ ఇది... జగన్ సంచలన వ్యాఖ్యలు!

వాలంటీర్లు రాష్ట్రంలోని ప్రతి గడపకు సేవలందిస్తున్నారు

By:  Tupaki Desk   |   21 July 2023 8:33 AM GMT
క్యారెక్టర్ లేనివాళ్ల క్యారెక్టర్ ఇది... జగన్ సంచలన వ్యాఖ్యలు!
X

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇవాళ తిరుపతి వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధుల జమ కార్యక్రమంలో సీఎం జగన్‌ ప్రసంగిస్తూ.. వాలంటీర్‌ వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలతో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వాలంటీర్లు రాష్ట్రంలోని ప్రతి గడపకు సేవలందిస్తున్నారు. ఎండ, వాన, చలి, వరదలను లెక్క చేయకుండా పని చేస్తున్నారు. ఒకటో తేదీ వచ్చిందంటే... అది సెలవు రోజైనా, పండగరోజైనా ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే తలుపు తట్టి అవ్వా తాతలకు పెన్షన్ ఇస్తున్నారని జగన్ వాలంటీర్లను కొనియాడారు. అలాంటి అలాంటి వాళ్లపై అన్యాయంగా బురద జల్లుతున్నారని జగన్ ఫైరయ్యారు.

ఇదే సమయంలో వాలంటీర్లు అంటే ఎవరో కొత్త వారు కాదని, బయటవారూ కాదని చెప్పిన జగన్... ఊరిలో పిల్లలే, కళ్ల ముందు తిరిగేవారే.. అలాంటి వారిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా "ఇందుకు సంబంధించిన స్క్రిప్టు రామోజీరావు, నిర్మాత చంద్రబాబు అయితే... నటనా, మాటలూ, డైలాగులూ అన్నీ దత్తపుత్రుడివి" అని జగన్ సెటైర్లు వేశారు.

అనంతరం మరింత సీరియస్ అయిన జగన్... వాలంటీర్లు స్త్రీలను లోభరచుకుంటారని ఒకడంటాడు.. గ్రామవాలంటీర్లు అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి ముంబాయికో ఎక్కడికెక్కడికో పంపించేస్తున్నారని ఇంకొకడు నిస్సిగ్గుగా అంటాడు అని జగన్ ఏకవచనంతో ఫైరయ్యారు.

ఈ విమర్శలను నిస్సిగ్గుగా పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో అచ్చేస్తున్నారని జగన్ ఫైరయ్యారు. ఇలాంటివారంతా వాలంటీర్లపై బురదజలుతారని, అబద్ధాలకు రెక్కలు తొడుగుతారని జగన్ నిప్పులు చెరిగారు. గ్రామవాలంటీర్లలో సుమారు 60శాతం తన చెల్లమ్మలే అని చెప్పుకున్న జగన్... వాలంటీర్లంతా చదువుకున్న సంస్కారులు అని జగన్ కితాబిచ్చారు!

ఇలాంటివారిని తప్పుపట్టింది ఎవరో తెలుసా అని ప్రశ్నించిన జగన్... ఇలాంటి వాలంటీర్ల క్యారెక్టర్ ని తప్పుపట్టిన వారిలో ఒకరు 10ఏళ్లుగా చంద్రబాబుకు వాలంటీరుగా పనిచేస్తున్న ప్యాకేజీ స్టార్ అని, ఇంకొకరు చంద్రబాబు అని, వారి అనుకూల మీడియా కలిసిన గజదొంగల ముఠా అని జగన్ నిప్పులు చెరిగారు.

వాలంటీర్ల క్యారెక్టర్ ఎలాంటిదో ప్రజలకు తెలుసు అని చెప్పిన జగన్... అసలు చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిదో, దత్తపుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, ఆయన సొంత పుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, ఆయన బావమరిది క్యారెక్టర్ ఎలాంటిదో ప్రజలకు బాగా తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు.

"చంద్రబాబు నాయుడి వాలంటీర్, దత్తపుత్రుడు అమ్మాయిలను లోబరచుకుని, వారిని పెళ్లిచేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేయడం.. మళ్లీ వదిలేయడం.. మళ్లీ ఇంకొకరిని పెళ్లిచేసుకోవడం మళ్లీ వదిలేయడం.. ఆ తర్వాత మళ్లీ పెళ్లి మళ్లీ వదిలేయడం. పైగా ఒకరితో వివాహ బంధంలో ఉండగానే... ఇంకొకరితో అక్రమ సంబంధం.. ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు" అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక మరోవ్యక్తి "పట్టపగలే మందు తాగుతూ పదిమంది అమ్మాయిలతో స్విమ్మింగ్ ఫూల్ లో డ్యాన్సులు చేసేవాడు ఇంకొకడు" అని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకొకరు "అమ్మాయిలు కనిపిస్తే చాలు ముద్దైన పెట్టాలి, లేదా కడుపైనా చేయాలని ఇంకొకడు అంటాడు" అని జగన్ ఏకవచనంతో సంభొదిస్తూ నిప్పులు చెరిగారు.

ఇదే సమయంలో "మరో క్యారెక్టర్ ఉంది.. వయసు 75 ఏళ్లు.. అయినా సిగ్గు లేదు.. ఒక టీవీ షోకి వచ్చి.. బావా నువ్వు సినిమాల్లోనే చేశావు నేను నిజజీవితంలోనే చేశాను అంటూ చేసిన వెదవ పనులను గొప్పగా చెప్పుకున్న ముసలాయన ఇంకొకడు" అంటూ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నిజజీవితంలో ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వారంతా... వాలంటీర్ల గురించి విమర్శలు చేస్తుంటే... ఇది కలియుగం కాక మరేమిటని జగన్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.