డైరీ ఇవ్వాల్సిన అవసరం లేదు
సునీత వైఖరిపైన అందరిలోను అనుమానాలు
By: Tupaki Desk | 19 July 2023 5:49 AM GMTసీబీఐ డైరీ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు జడ్జీలు స్పష్టంగా చెప్పేశారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ దర్యాప్తు వివరాల డైరీ తనకు కావాలని సునీత పిటీషన్ వేశారు. ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ మొదలైన కాసేపటికీ కేసును జడ్జీలు కొట్టేశారు. అసలు సీబీఐ దర్యాప్తు డైరీ వివరాలు మీకు ఇస్తారని ఎలా అనుకున్నారంటు జడ్జీలు ఆశ్చర్యపోయారు.
నిజానికి ఆ డైరీలో ఏముంటుందో బయట వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. తెలుసుకునే అవసరం కూడా లేదు. ఎందుకంటే తన డైరీలోని వివరాల ఆధారంగానే కేసు విచారణ సందర్భంగా కోర్టులో సీబీఐ లాయర్ వాదనలు వినిపిస్తారు.
ఆ వాదనలను బట్టి సీబీఐ డైరీ వివరాలను అంచనా వేసుకోవచ్చు. లేదంటే అవకాశం ఉంటే అనధికారికంగా డైరీలోని వివరాలను తెలుసుకోవచ్చంతే. అలాంటిది ఏకంగా డైరీ వివరాలను సునీత అడగటమే చాలా ఆశ్చర్యంగా ఉంది.
అసలు డైరీలోని వివరాలను తెలుసుకుని సునీత ఏం చేస్తారన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు. తేన తండ్రి హంతకులకు శిక్షలు పడిందా లేదా అన్నదే సునీతకు ముఖ్యం. అయితే ఆమె వైఖరి కారణంగా ఆమె మీదనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.
వివేకా హంతకుల్లో ముఖ్యడైన దస్తగిరి బెయిల్ మీద హ్యాపీగా బయట తిరుగుతుంటే సునీత పట్టించుకోవటం లేదు. నిజానికి దస్తగిరి బెయిల్ రద్దుచేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేయాల్సిన సునీత అసలు పట్టించుకోవటం లేదు. పైగా దస్తగిరి బెయిల్ రద్దుచేయాలని పిటీషన్ వేసిన వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటీషన్ను వ్యతిరేకించారు.
ఇక్కడే సునీత వైఖరిపైన అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎలాగైనా జైలుకు పంపాలని పదేపదే ప్రయత్నిస్తున్నారు. హత్యలో అవినాష్ పాత్రుందని ఇప్పటివరకు సీబీఐకి ఆధారాలు దొరకలేదు. అయినా సరే ఎంపీ జైలుకు వెళ్ళాల్సిందే అని సునీత పట్టుబట్టారు. మొత్తంమీద సునీత కోరిక నెరవేరుతుందా లేదా తెలీదు కానీ తాజాగా సీబీఐ దర్యాప్తు డైరీ వివరాలు కావాలని అడగటంతో జడ్జీలే ఆశ్చర్యపోయారు.