జోతిష్యం: దీపికకు రణవీరుడే పుడతాడు!
దీపిక పదుకొనే గర్భధారణ ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్. బేబి బంప్‌తో దీపిక ఎక్కడ కనిపించినా వెంటనే దానిపై డిస్కషన్లు పెడుతున్నారు.
By: Tupaki Desk | 5 July 2024 3:30 PM GMTదీపిక పదుకొనే గర్భధారణ ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్. బేబి బంప్‌తో దీపిక ఎక్కడ కనిపించినా వెంటనే దానిపై డిస్కషన్లు పెడుతున్నారు. పుట్టబోయేది జూనియర్ రణవీరుడా? లేక జూనియర్ దీపికనా? అంటూ డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటి వారికి నిరభ్యంతరంగా ``పుట్టబోయేది మగ బిడ్డే``నని చెబుతున్నారు జ్యోతిష్కులు. జూనియర్ రణవీర్ సింగ్ ని ఇంటికి ఆహ్వానించబోతోందని దీపికపై జోశ్యం చెబుతున్నారు. అసలింతకీ జోశ్యుడు చెప్పిందేమిటో పూర్తి వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జంట దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ సెప్టెంబర్ 2024లో తల్లిదండ్రులయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. రణవీర్ సింగ్ ఫిబ్రవరి 29న సోషల్ మీడియాలో గర్భధారణ వార్తలను ప్రకటించారు. అయితే ఆడపిల్ల పుడుతుందా? లేక మగ బిడ్డ పుడుతున్నాడా? అన్నది తెలుసుకోవాలని అభిమానుల ఆసక్తి. ఓ వైపు `కల్కి 2898 AD` విజయాన్ని ఆస్వాధిస్తున్న దీపికా పదుకొణె బేబి బంప్ తోనే తన సినిమాకి ప్రమోషన్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ గర్భంపై చాలా సరదా జోకులే వేసారు సహనటులు. వేదిక అంతా నవ్వులతో నిండిపోయింది.
ప్రముఖ జ్యోతిష్కుడు- ఫేస్ రీడర్ అయిన పండిట్ జగన్నాథ్ గురూజీ ఈ జంట మగబిడ్డకు స్వాగతం పలుకుతారని జోస్యం చెప్పారు. ఇదే జ్యోతిష్యుడు గతంలో దీపిక ఎప్పుడు గర్భం దాలుస్తుందో కూడా చెప్పాడు. ``2024లో దీపికా పదుకొణె గర్భం దాల్చనుందని, తల్లిదండ్రులకు యువరాజుగా ఉండే మగబిడ్డతో ఆశీర్వాదం అందుకుంటార``ని చెప్పాడు. బాలుడు చక్కదనంతో అదృష్టంతో పుట్టాలని ఆశిస్తున్నట్లు కూడా చెప్పాడు.
నవంబర్ 1న విడుదల కానున్న రోహిత్ శెట్టి `సింగం ఎగైన్`లో దీపిక -రణవీర్ సింగ్ జంటగా కనిపిస్తారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ ఖాన్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ కూడా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.