అన్నీ మంచిరోజులే.. పెళ్లిళ్లకు సూపర్ టైం!
ఎంగేజ్ మెంట్లు.. పెళ్లిళ్లు.. శంకుస్థాపనలు.. గ్రహప్రవేశాలు ఇలా చెప్పుకుంటూ శుభకార్యాలకు అత్యుత్తమ కాలంగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 10 Feb 2024 9:30 AM GMTవేసవి వచ్చేసింది. శివరాత్రి తర్వాత మొదలయ్యే ఎండ మంట కాస్త ముందుగానే తెలుగు రాష్ట్రాల్ని టచ్ చేసింది. ఎండాకాలం వచ్చేసిందంటే చాలు.. పెళ్లిళ్ల జోరు కనిపిస్తుంది. ఈసారి పెళ్లిళ్ల ముహుర్తాలకు బోలెడన్ని మంచి రోజులు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 30 వరకు ఎన్ని మంచిరోజులో అని చెబుతున్నారు. పెళ్లిళ్లు చేసుకోవటానికి ఇదే అత్యుత్తమ టైంగా చెబుతున్నారు.
పరీక్షల టైం ఒక్కటే అన్నది తప్పించి.. మూడు నెలల వ్యవధిలో దాదాపు 35-40 వరకు మంచి రోజులు ఉన్నట్లు చెబుతున్నారు. శుభ ముహుర్తాలకు నెలవుగా చెప్పే మాఘ మాసం ఈ రోజు నుంచే మొదలు కానుంది. గడిచిన కొన్ని రోజులుగా ఉన్న మూడాలు పోయి.. మంచిరోజులు వచ్చేయటంతో రానున్న రోజులన్నీ శుభకార్యాలతో సందడి.. సందడిగా ఉండే పరిస్థితి.
ఎంగేజ్ మెంట్లు.. పెళ్లిళ్లు.. శంకుస్థాపనలు.. గ్రహప్రవేశాలు ఇలా చెప్పుకుంటూ శుభకార్యాలకు అత్యుత్తమ కాలంగా చెబుతున్నారు. ఈ నెల (ఫిబ్రవరి) 11 నుంచి ఏప్రిల్ 26 వరకు మంచి రోజులకు కొదవ లేదంటున్నారు. ఈ నెల 14న వసంత పంచమి రోజున వేలాది పెళ్లిళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందడికి తగ్గట్లే పెళ్లి మండపాలు.. పెళ్లిళ్లలకు సంబంధించిన అన్ని రకాల బుకింగ్ లు.. క్యాటరింగ్ బుకింగ్ లు పూర్తి అయ్యాయి. ఇక.. షాపింగ్ సందడి కూడా షురూ అవుతుందని చెబుతున్నారు.
ఇంతకూ మంచి ముహుర్తాలు ఏ నెలలో ఏయే రోజులన్నది చూస్తే..
ఫిబ్రవరిలో
11, 13, 14, 15, 18, 19, 21, 22, 24
మార్చిలో..
1, 3, 7, 11, 13, 16, 17, 19, 20, 24, 25, 27, 28, 30
ఏప్రిల్ లో..
1, 3, 4, 5, 6, 9, 18, 19, 20, 21, 22, 24, 26.