Begin typing your search above and press return to search.

హోండా జాజ్ Vs హ్యూందాయ్ ఎలైట్ ఐ20!

By:  Tupaki Desk   |   22 July 2015 10:59 AM GMT
హోండా జాజ్ Vs హ్యూందాయ్ ఎలైట్ ఐ20!
X
జపనీస కార్ల కంపెనీ తయారు చేసిన కార్లలో ఈ ఏడాది విడుదలైన హోండా జాజ్ మార్కెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇదే సమయంలో హ్యూదాయ్ ఎలైట్ ఐ-20 కూడా మార్కెట్ లో బాగా పాపులర్ అయ్యింది! ఈ క్రమంలో ఈ రెండు కార్లు ధర విషయంలో ఒకేలా ఉన్నాయి! అటు డీజిల్ వెర్షన్ అయినా, పెట్రోల్ వెర్షన్ అయినా ధర దాదాపు సమానంగా ఉంది! అయితే... ఈ రెండింటిలో ఏ కారుకి ఏ ఫీచర్స్ ఉన్నాయి, వీటి మధ్య పోటీకి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!

ముందుగా ధర విషయానికి వస్తే... హోండా జాజ్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభధర రూ. 5.31 లక్షలు కాగా డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.50 లక్షలు! ఇక హ్యూందాయ్ ఎలైట్ ఐ20 ఢిల్లీ ఎక్స్ షోరూం ధర పెట్రోల్ వేరియంట్ కు రూ. 5.30 లక్షలు గా ఉంటే... డీజిల్ ప్రారంభ ధర రూ. 6.42లక్షలు! ధర విషయంలో ఈ రెండు కార్లు దాదాపు సమానంగానే ఉన్నాయి!

ఇక డిజైన్ ని పరిశీలిస్తే... హోండా జాజ్ డిజైన్ మొత్తం కొతగా ఉండటంతో పాటూ స్పోర్టీగా ఉంటూ క్రోం టచెస్ తో ఉంది! ఇదే సమయంలో బోల్డ్ చారెక్టర్ లైన్ తో స్లీక్ వ్రాప్ గ్రౌండ్ హెడ్ లైట్ ను ప్రత్యేకంగా కలిగి ఉంది! ఇక హ్యూందాయ్ ఎలైట్ ఐ20 డిజైన్ మొత్తం ఫ్లూయిడిక్ 2.0 డిజైన్ కాన్సెప్ట్‌తో తయారుచేయబడింది. బౌండరీ కన్వేలో క్రోమ్ ఎలిమెంట్‌తో కూడిన హెక్సాగానల్ గ్రిల్ ను ప్రత్యేకంగా కలిగి ఉంది.

ధర, డిజైన్ విషయాలు అలా ఉంటే... ఫ్యూచర్స్ లో కూడా ఈ రెండు కార్లు పోటీ పడుతున్నాయి! ఈ విషయంలో 5 ఇంచెస్ ఐఏఎస్, ఆటో ఏసీ, ప్రీమియం డ్యాష్ బోర్డ్, స్టీరింగ్ మోటెడ్ ఆడియో కంట్రోల్, అడ్జస్టబుల్ డ్రవింగ్ సీట్, రేర్ పార్కింగ్ కెమెరా లతో హోండా జాజ్ ఉండగా... డీఐఎన్ ఆడియో సిస్టం, ఆటో ఏసీ, కూలింగ్ గ్లోవ్ బాక్స్, అడ్జస్టబుల్ డ్రవర్ సీట్ ఫీచర్స్ ని హ్యూందాయ్ ఎలైట్ ఐ20 కలిగి ఉంది!

అతి ప్రధానమైన ఇంజన్, స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే... హోండా జాజ్ పెట్రోల్ ఇంజిన్... 90 పీఎస్ పవర్ ను జనరేట్ చేయగలిగి, 18.7 కి.మీ./లీ మైలేజి ఇవ్వగలిగేలా రూపొందించబడింది. అదే డీజిల్ విషయానికి వస్తే... 100 పీఎస్ పవర్ ను జనరేట్ చేయగలిగి సుమారు 27.3 కి.మీ./లీ మైలేజ్ ఇవ్వగలుగుతుంది!
హ్యూందాయ్ ఎలైట్ ఐ20 ఇంజిన్ స్పెసిఫికేషన్స్ లో పెట్రోల్ ఇంజిన్... 83 పీఎస్ పవర్‌ను జనరేట్ చేయగలి, 17.19 కి.మీ/లీ మైలేజ్ ఇస్తుంది! అదే డీజిల్ విషయనికి వస్తే... 90 పీఎస్ పవర్‌ను ఉత్పత్తి చేయగలిగి, 21.19 కి.మీ/లీ మైలేజ్ ను అందిస్తోంది!

లాస్ట్ బట్ నాట్ లీస్ట్... సెక్యూరిటీ విషయానికి వస్తే... రెండు కార్లు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, రేర్ పార్కింగ్ అసిస్ట్‌ లను కలిగి ఉన్నాయి. అయితే హోండా జాజ్ సీట్ బెల్ట్ ఫ్రీ టెన్షనర్‌ను అదనంగా కలిగి ఉంది.