భారత్ లో యాపిల్ జోరు... రికార్డ్ స్థాయిలో ఎగుమతుల హుషారు!
ఈ మేరకు.. సుమారు రూ.1.08 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేస్తినట్లు కథనాలొస్తుండటం సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 13 Jan 2025 3:30 PM GMTభారత్ లో యాపిల్ ఐఫోన్ల ఎగుమతులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా... 2024లో భారత్ నుంచి ఎగుమతి అయిన ఐ ఫోన్ల విలువ రూ. లక్ష కోట్ల మైలురాయిని చేరుకున్నాయని చెబుతున్నారు. ఈ మేరకు.. సుమారు రూ.1.08 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేస్తినట్లు కథనాలొస్తుండటం సంచలనంగా మారింది.
అవును... 2024లో భారత్ నుంచి యాపిల్ సుమారు 12.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసినట్లు చెబుతున్నారు. అంటే... ఈ ఎగుమతుల విలువ సుమారు రూ.1.08 లక్షల కోట్లన్నమాట. దీంతో.. గత ఏడాది ఎగుమతుల్లో 42% వృద్ధి నమోదైనట్లు చెబుతుండగా.. దేశీయ ఉత్పత్తి 46% పెరిగి రూ.1.48 లక్షల కోట్లకు చేరుకుందని అంటున్నారు.
ఫాక్స్ కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటీ కంపెనీల రాకతో దేశీయంగా తయారీ రంగాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు అమలుచేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం గణనీయ ఫలితాలు అందిస్తోందని అంటారు. ఈ సమయంలో... 1,85,000 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయి. అందులో 70% మందికి పైగా స్త్రీలు ఉన్నారని చెప్పడం గమనార్హ.
ఈ నేపథ్యంలో... భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్లూ కాలర్ ఉద్యోగ సృష్టికర్తగా యాపిల్ నిలిచింది. ఈ హవా ఇలానే కొనసాగితే రానున్న సంవత్సరాల్లో యాపిల్ సుమారు 20 బిలియన్ డాలర్ల వార్షిక ఉత్పత్తిని చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా... భారత్ వాటా 14 నుంచి 26 శాతం కంటే ఎక్కువ పెరగొచ్చని భావిస్తున్నారు.