ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో వచ్చేస్తోంది... ఫీచర్లు ఇవే?
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా కొత్త 5వ జనరేషన్ ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో లాంచింగ్ కు రెడీ అయ్యింది. అవును... ఈ ఏడాది ఆగస్ట్ 1న టయోటా తన ల్యాండ్ క్రూజయిర్ ను లాంచ్ చేయనుంది.
By: Tupaki Desk | 30 July 2023 5:37 AM GMTప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా కొత్త 5వ జనరేషన్ ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో లాంచింగ్ కు రెడీ అయ్యింది. అవును... ఈ ఏడాది ఆగస్ట్ 1న టయోటా తన ల్యాండ్ క్రూజయిర్ ను లాంచ్ చేయనుంది. ఎస్.యు.వి. మొదటిసారిగా అమెరికాలో ల్యాండ్ క్రూయిజర్ పేరుతో ఆవిష్కరించనుంది.
అవును... ఆగస్ట్ 1 న ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో విడుదల కాబోతోంది. ఇందులో భాగంగా... టయోటో మొదటిసారిగా ప్రాడో మోడల్ కారును ప్రవేశపెట్టనుంది. కొత్త టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోను లెక్సస్ బ్రాండెడ్ మాదిరిగా లెక్సస్ జీఎక్స్ ఫీచర్లతో రానుంది. ఈ లేటెస్ట్ మోడల్ లో ప్రయోజనకరమైన, కఠినమైన డిజైన్ ను అందించనుంది.
టయోటా కొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో టి.ఎన్.జి.ఏ. - ఎఫ్ ప్లా ట్ ఫారమ్ ను ఉపయోగించింది. లెక్సస్ జిఎక్స్ కి కూడా సపోర్టు అందిస్తుంది. కంపెనీ పవర్ ట్రెయిన్ లకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటివరకూ వెల్లడించనప్పటికీ... లెక్సస్ జీఎక్స్ తో అందించిన వాటితో సమానంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ కొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో దీర్ఘచతురస్రాకార హెడ్ ల్యాంప్ లతో మెష్-టైప్ గ్రిల్ తో వస్తుందని టయోటా ధృవీకరించింది. కిందిభాగంలో కఠినమైన స్కిడ్ ప్లేట్ ను కలిగి ఉండనుంది. ఎస్.యు.వి. ప్రొఫైల్ లో బుచ్, స్క్వేర్డ్ డిజైన్ ను అందించనుంది. లెక్సస్ జిఎక్స్ - ప్రాడో మధ్య సారూప్యతలు ప్రధానంగా కాస్మెటిక్ మార్పులతో ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.
కొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఉత్తర అమెరికా మార్కెట్లోకి వస్తుంది. అయితే, ల్యాండ్ క్రూయిజర్‌గా విక్రయించనుంది. ప్రాడో ల్యాండ్ క్రూయిజర్ ఎల్.సి. 300 అయితే ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఈ ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ను వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి తీసుకురానుంది.
ఇక ఇందులో 349 బి.హెచ్.పి. తో 3.4-లీటర్ వీ6, అలాగే హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ లు, పెట్రోల్/డీజిల్ ఇంజిన్ లు ఉన్నాయి. ఏ.డబ్ల్యూ.డి తో ఆఫ్-రోడ్ సామర్థ్యం గల సస్పెన్షన్ ను అందించనుంది.