Begin typing your search above and press return to search.

ఈ జాబితాలో మీ ఫోన్లు ఉన్నాయా ?

ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొత్త డివైజ్‌లకు అప్‌గ్రేడ్ కావాలని సూచించింది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 8:30 AM GMT
ఈ జాబితాలో మీ ఫోన్లు ఉన్నాయా ?
X

భద్రతా కారణాల రీత్యా తరచూ సాఫ్ట్‌వేర్‌ను అప్ డేట్ చేసే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొన్ని స్మార్ట్ ఫోన్ పాత మోడళ్లకు తన వాట్సప్ సేవలు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ప్రముఖ బ్రాండ్లకు చెందిన 35 రకాల మోడళ్ల సెల్ ఫోన్లకు వాట్సప్ సేవలు త్వరలో నిలిపివేస్తామని, భవిష్యత్తులో మరిన్ని మోడళ్లకు కూడా నిలిపి వేస్తామని తెలిపింది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొత్త డివైజ్‌లకు అప్‌గ్రేడ్ కావాలని సూచించింది. ఈ జాబితాలో ఆపిల్ బ్రాండ్లు కూడా ఉండడం విశేషం.

యాపిల్: ఐఫోన్ 5, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ

లెనోవా: లెనోవా 46600, లెనోవా ఏ858టీ, లెనోవా పీ70, లెనోవా ఎస్890

శాంసంగ్: గాలక్సీ ఏస్ ప్లస్, గాలక్సీ కోర్, గాలక్సీ ఎక్స్‌ప్రెస్ 2, గాలక్సీ గ్రాండ్, గాలక్సీ నోట్ 3, గాలక్సీ ఎస్ 3 మినీ, గాలక్సీ ఎస్ 4 యాక్టివ్, గాలక్సీ ఎస్ 4 మినీ, గాలక్సీ ఎస్ 4 జూమ్.

మొటొరోలా: మోటో జీ, మోటో ఎక్స్.

హువావే: ఎసెండ్ పీ6 ఎస్, ఎసెండ్ జీ525, హువావే సీ199, హువావే జీఎక్స్1ఎస్, హువావే వై625.

సోనీ: ఎక్స్‌పీరియా జీ1, ఎక్స్‌పీరియా ఈ3

ఎల్‌జీ: ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డీ, ఆప్టిమస్ జీ, ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ ఎల్7