Begin typing your search above and press return to search.

టాప్-10 కార్ల కంపెనీల్లో యూఎస్ మిలటరీకి వాహనాలు అందించే సంస్థ తెలుసా?

కాస్త డబ్బులు ఉన్న వారు తమ హోదాకు తగిన కార్లు కొనాలని కలలుగంటారు.

By:  Tupaki Desk   |   30 July 2024 4:09 AM GMT
టాప్-10 కార్ల  కంపెనీల్లో యూఎస్  మిలటరీకి వాహనాలు అందించే  సంస్థ తెలుసా?
X

కాస్త డబ్బులు ఉన్న వారు తమ హోదాకు తగిన కార్లు కొనాలని కలలుగంటారు. ఈ సమయంలో కొంతమంది తమ వేతనాలకు తగినట్లుగా ఈఎంఐ లు సెట్ చేసుకుంటే.. మరికొంతమంది తమకు కావాల్సిన లగ్జరీ కార్ కోసం ఎన్ని కోట్లయినా లెక్కచేయకుండా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. ఈ క్రమంలో అసలు ప్రపంచంలో టాప్-10 కార్ల కంపెనీలు ఏమి ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.

అవును... ప్రపంచంలోని టాప్-10 కార్ల కంపెనీలు ఏవి, ఆ కార్ల కంపెనీల అధినేతలు ఎవరు, వాటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా... మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఈ అతిపెద్ద కార్ల కంపెనీలను ఎంపిక చేస్తారు. వాటిలో ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఎలాన్ మస్క్ కి చెందిన "టెస్లా" ఉండగా.. టెన్త్ ప్లేస్ లో "జనరల్ మోటార్స్" ఉంది.

టెస్లా:

ఈ సంస్థ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ కాగా.. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని ఆస్టిన్ లో ఉంది.

ఎలోన్ మస్క్ స్థాపించిన ఈ కార్ల కంపెనీ టెస్లా... ఎలక్ట్రిక్ కార్లతో ఆటోమోటివ్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చేసింది. అద్భుతమైన టెక్నాలజీకి ప్రస్తిద్ధి చెందిన టెస్లా.. సెల్ఫ్ డ్రైవింగ్ పురోగతితో పాటుగా మోడల్ ఎస్, మోడల్ 3, మోడల్ ఎక్స్, మోడల్ వై వంటి ప్రసిద్ధ మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది.


టయోటా:

ఈ సంస్థ సీఈఓ కొజి సతొ కాగా... ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జపాన్ లోని టయోటా సిటీలో ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా నమ్మకం, సామర్థ్యానికి చిహ్నంగా ఈ టయోటా ఆటోమోటివ్ నిలుస్తుందని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆటోమేకర్ లలో ఒకటిగా ఉన్న ఈ సంస్థ... ప్రియస్ వంటి హైబ్రిడ్ ల నుంచి టాకోమా వంటి కఠినమైన ట్రక్కుల వరకూ అనేక రకాల వాహనాలను ఉత్పత్తి చేస్తుంది.


బీవైడీ:

ఈ సంస్థ సీఈవో వాంగ్ చువాన్ ఫు కాగా.. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం చైనాలోని షెన్ జెన్ లో ఉంది.

ఇక ఈ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) అనేది చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీలో ప్రత్యకత కలిగిన ఆటోమేకర్. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ రవాణాను అందరికీ అందుబాటులోకి తేవాలనే కృతనిశ్చయంతో ఉందని అంటారు.


మెర్సిడేస్ - బెంజ్:

ఈ సంస్థ సీసీఓ ఓలా కల్లెనియుస్ కాగా... ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జర్మనీలో స్టట్ గార్డ్ లో ఉంది.

ఈ మెర్సిడెస్ బెంజ్ కార్లు లగ్జరీ, స్కిల్స్, టెక్నాలజీ ఆవిష్కరణలు పర్యాయపదంగా ఉందనే చెప్పాలి. సొగసైన సెడాన్ వెహికల్స్ నుంచి పవర్ ఫుల్ ఎస్.యూ.వీ, అధిక పనితీరు కలిగిన ఏ.ఎం.జీ మోడల్స్ వరకూ ఈ మెర్సిడెస్ బెంజ్ ఆటోమోటివ్ లగ్జరీలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూనే ఉంది.


ఫెరారీ:

ఈ సంస్థ సీఈవో బెనెడెట్టో విగ్నా కాగా... ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఇటలీలోని ఎమిలియా రొమాగ్నా లో ఉంది.

అటోమోటివ్ ప్రపంచంలో అభిరుచి, ఫెర్మార్మెన్స్, స్పెషలిటీస్ వంటి వాటికి ఈ ఫెరారీ పర్యాయపదంగా ఉంది. ప్రధానంగా సూపర్ కార్లతో పాటు రేసింగ్ లెజెండ్ల తయారీలోనూ ఈ ఫెరారీ దిగ్గజంగా ఉంది. ఈ ఇటాలియన్ ఆటోమోటివ్.. క్వాలిటీ విషయంలో రాజీపడనే పేరు సంపాదించుకుంది.


పోర్షే:

ఈ సంస్థ సీఈవో ఆలివర్ బ్లూమ్ కాగా... ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జర్మనీలోని స్టట్ గార్డ్ లో ఉంది.

లగ్జరీ కం బెస్ట్ పెర్ఫార్మెన్స్ గల స్పోర్ట్స్ కార్లకు ఈ కంపెనీ ప్రసిద్ధి చెందింది. ఐకానిక్ 911 నుంచి కాయెన్ ఎస్.యూ.వీ వరకూ పోర్షే వాహనాలు పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ని కలిగి ఉంటాయి! ఇది ఉత్తేజకరమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుందని అంటారు.


బీఎండబ్ల్యూ:

ఈ సంస్థ సీసీవో ఆలివర్ జిప్సే కాగా... ఈ సంస్థ జర్మనీలోని బవేరియాలో ని మ్యూనిచ్ లో ఉంది.

లగ్జరీ, బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో కూడిన ప్రీమియం వాహనాలకు ఈ బీఎండబ్ల్యూ ప్రసిద్ధి చెందింది. 3 సిరీస్ వంటి స్పోర్టీ సెడాన్ ల నుంచి ఎక్స్-5 వంటి సొగసైన ఎస్.యూవీల వరకూ ఈ కంపెనీ విస్తృతమైన శ్రేణిని కలిగి ఉంది! ఈ కంపెనీ కార్ల డ్రైవింగ్ ఎక్సలెన్స్ కు ప్రమాణాన్ని సెట్ చేస్తుందని అంటారు.


వోక్స్ వ్యాగన్:

ఈ సంస్థ సీఈవో ఆలివర్ బ్లూమ్ కాగా... ఈ సంస్థ కార్యాలయం జర్మనీలో వోల్ఫ్స్ బర్గ్ లో ఉంది.

ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమేకర్ లలో ఒకటిగా ఉన్న వోక్స్ వ్యాగన్... నాణ్యత, భద్రత విషయంలో దాని నిబద్ధతకు ప్రసిద్ధి చెందింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ, సుస్థిర రవాణాలో అగ్రగామిగా ఉన్న ఈ వోక్స్ వ్యాగన్.. ప్రధానంగా సెక్యూరిటీ విషయంలో అధిక మార్కులు పొందినట్లు చెబుతారు.


స్టేల్లాంటిస్:

ఈ సంస్థ సీఈవో కార్లోస్ తవారెస్ కాగా.. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్ లోని హూఫోర్ప్ లో ఉంది.

ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్, పీ.ఎస్.ఏ. గ్రూప్ విలీనంతో ఏర్పడిన ఈ స్టెల్లాంటిస్.. విభిన్న బ్రాండ్ ల పోర్ట్ ఫోలియోతో ఉన్న ప్రముఖ ప్రపంచ ఆటోమోటివ్ తయారీదారు. జీప్, రామ్ వంటి దిగ్గజ అమెరికన్ బ్రాండ్ ల నుంచి ప్యూగోట్, సిట్రోయెన్ వంటి యూరోపియన్ ఫేవరెట్స్ వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి స్టెల్లాంటిస్ అనేక రకాల వాహనాలను అందిస్తోంది!


జనరల్ మోటార్స్:

ఈ సంస్థ సీఈవో మేరీ బర్రా కాగా.. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలోని డెట్రాయిట్ లో ఉంది.

ఈ సంస్థను విలియం సి డ్యురాంట్ 1908 సెప్టెంబర్ 16న స్థాపించారు. ఆ సమయంలో డ్యురాంట్... గుర్రపు వాహనాలను ఎక్కువగా విక్రయించేవాడు. చెవ్రోలెట్, జీ.ఎం.సీ, కాడిలాక్, బ్యూక్ వంటి బ్రాండ్లకు ఈ ఆటోమొబైల్ కంపెనీ ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ, మిలటరీ కోసం వాహనాలను తయారు చేస్తుంది.