Begin typing your search above and press return to search.

స‌ముద్రంలో ర‌క్త‌టేరులు పారించారు

By:  Tupaki Desk   |   26 July 2015 10:38 AM GMT
స‌ముద్రంలో ర‌క్త‌టేరులు పారించారు
X
ర‌మ‌ణీయ‌మైన ప్ర‌కృతితో ఆ దీవిలో స‌ముద్రం చాలా ప్ర‌శాంతంగా ఉంటుంది. అయితే.. ప్ర‌తి ఏటా ఒక్క‌సారి మాత్రం ఆ సముద్రంలో ర‌క్త‌టేరులు పార‌తాయి. స‌ముద్రంలోని నీళ్లు.. ర‌క్తంలో నిండిపోయి.. భ‌యాన‌క వాతావ‌ర‌ణంతో నిండిపోతుంది. ఒళ్లు జ‌ల‌ద‌రించేలా అక్క‌డి సీన్ ఉంటుంది. ఇంత దారుణం కేవ‌లం మ‌నిషిలోని మృగం నిద్ర లేవ‌ట‌మే.

డెన్మార్క్ లోని ఫ‌రో దీవిలో ప్ర‌తిఏటా ఉత్స‌వాన్ని నిర్వ‌హిస్తుంటారు. ఈ ఉత్స‌వంలో ప్ర‌త్యేక ఏమిటంటే.. స‌ముద్రంలోని పైలెట్ తిమింగ‌లాల‌ను ఓడ్డుకు ప‌ట్టుకొచ్చి అత్యంత పాశ‌వికంగా హ‌త‌మారుస్తారు. ఇలా ఒక‌టో రెండో కాకుండా.. చంపేసే తిమింగ‌లాలు వంద‌ల్లో ఉంటాయి. వాటి ర‌క్తంతో స‌ముద్రం మొత్తం నిండిపోయి భ‌యాన‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది.

ఎందుకింత ఆట‌వికంగా అంటే.. కేవ‌లం ఉత్స‌వం కోసం మాత్ర‌మే ఇలాంటి ప‌నులు చేస్తారు. మ‌రిన్ని భారీ సంఖ్య‌లో పైలెట్ తిమింగ‌లాల‌ను చంపిన వారు.. వాటిని తింటారా అంటే.. వాటిని తినేంత మంది కూడా ఆ దీవిలో ఉండ‌రు. కేవ‌లం త‌మ స‌ర‌దా తీర్చుకోవ‌టం కోసం భారీగా పైలెట్ తిమింగాల్ని సంహ‌రించే ఆట‌విక సంస్కృతి ఫ‌రో దీవిలో క‌నిపిస్తుంది.

స‌ముద్రంలో వాటిని వేటాడి.. వాటి పీక కోసి..ఒడ్డుకు తీసుకొచ్చి ప‌డేస్తుంటారు. తాజాగా ఈ తీరులో 250 పైలెట్ తిమింగ‌లాల‌ను చంపేయ‌టంతో.. ఆ సముద్ర ప్రాంత‌మంతా ర‌క్తంతో నిండిపోయి.. మ‌నిషి ఎంత భ‌యంక‌ర‌మైన వాడ‌న్న భ‌యం క‌లిగేలా చేస్తారు అక్క‌డి వారు. ఈ ఉత్స‌వాన్ని వ్య‌తిరేకించే సీ షెప్ప‌ర్డ్ అనే సంస్థ సాహ‌సంతో.. ఈ అమానుసం బ‌య‌ట ప్ర‌పంచానికి సోష‌ల్ మీడియా ద్వారా బ‌య‌ట‌కువ‌చ్చింది.