Begin typing your search above and press return to search.
99 ఏళ్ల వృద్ధురాలికి 100 మార్కులు
By: Tupaki Desk | 3 Aug 2015 10:09 AM GMT చదువుకోవడానికి వయసుతో పనేంటి... ? అందుకే ఆ బామ్మ 99 ఏళ్ల వయసులో కాలేజిలో చేరి చదువుకుంటోంది. ఆత్మ విశ్వాసం, పట్టుదల, తపన, నేర్చుకోవాలన్న కుతూహలం ఉంటే ఏ వయసులోనైనా డిగ్రీలు సంపాదించొచ్చని నిరూపించింది. ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచిన 99 ఏళ్ల వృద్ధురాలిది అమెరికా. పేరు డొరీతా డేనియల్స్. జీవితకాలమంతా కాలక్షేపం కోపం రకరకాల మార్గాలు ఎంచుకుంది. అన్నిటిపైనా విసుగెత్తడంతో 2009లో కాలిఫోర్నియాలోని శాంతా క్లారిటాలో ఉన్న కెనియన్స్ కళాశాలలో చేరింది.
కెవియన్స్ కాలేజిలో చదువుతున్న కాలంలో ఆమెకు చాలాసార్లు గుండెపోటు వచ్చింది.. ఆమె డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దయింది. కానీ ఆమె మరింత పట్టుదలతో చదివారు. చదువుకు సంబంధించి కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి... ఊహించని అనేక సమస్యలు ఎదుర్కొంది. కానీ, ఎక్కడా పట్టు వీడకుండా చదువు కొనసాగించిందామె. కళాశాల నిర్వహించే ట్యూటరింగ్ సెంటర్‌కు హాజరై చదివేవారు. మొన్న జూన్ 5న ఆమె గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. మంచి పర్సంటేజితో పాసయ్యారు. డిగ్రీ పట్టా చేతికందడమే తరువాయి. ఆమెకు ఎంత పర్సంటేజి వచ్చింది... ఏ ర్యాంకు వచ్చిందని.. ఎన్ని మార్కలొచ్చాయి వంటివన్నీ పక్కన పెడితే 99 ఏళ్ల వయసులో పట్టువీడకుండా డిగ్రీ సంపాదించడమంటే ఆ విషయంలో ఆమెకు నూటికి నూరు మార్కులు ఇవ్వాల్సిందే.