Begin typing your search above and press return to search.
విమానం ఫ్లై ఓవర్ ఎక్కితే...
By: Tupaki Desk | 20 July 2015 5:29 AM GMTఈ పక్కనున్న ఫోటో చూస్తే మీకేమనిపిస్తుంది? ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా విమానం వెళుతోందని అనుకుంటున్నారా? ఎవరో మాంచి ఫోటోగ్రాఫర్ కెమేరా పనితనం అనుకుంటున్నారా? అబ్బే అదేం కాదు ఇది ఫ్లైఓవరే కానీ... అది బైకులకు, కార్లకు, బస్సులకు కాదు! ఇది విమానం రన్ వే!! కాకపోతే ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదులెండి! స్వీడన్ లోని స్టాక్ హోం లో రన్ వేలు ఇలా కూడా ఏర్పాటు చేయొచ్చు అంటూ అలెక్స్ సటన్ అనే ఆర్కి టెక్చర్ చెబుతున్నారు! ఇది ఆయన చెప్పాలనుకున్న ప్రాజెక్ట్ ఊహా చిత్రం!
అలెక్స్ సటన్ అనే ఆర్కిటెక్చర్ సిటీ మధ్యలో ఒక పెద్ద విమానాశ్రయం, దాని నుంచి పెద్ద పెద్ద భవనాల మధ్య ఉన్న చిన్న చిన్న ఖాళీల మధ్య నుండి ఇలా ఫ్లైఓవర్స్ నిర్మించి వాటిని రన్ వేలుగా ఏర్పాటు చేస్తుకోవచ్చు అని చెబుతున్నారు. దీనివల్ల వందల వేల ఎకరాల భూమి అవసరం లేదని, ఈ ఆలోచన తో విమాన రంగ రూపు రేఖల్ని మార్చేయొచ్చని ఈ యువ ఆర్కిటెక్ట్ చెప్పుకొస్తున్నారు! ఏది ఏమైతేనే... ఇటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చి సక్సెస్ అయితే... మిగిలిన దేశాలు కూడా ఫాలో అయిపోతాయి మరి!