Begin typing your search above and press return to search.
బిలియనీర్ బిక్షగాళ్లు
By: Tupaki Desk | 13 July 2015 6:01 AM GMT నెలకు 75 వేల రూపాయలు సంపాదిస్తూ... ముంబయిలో 80 లక్షల రూపాయల ఫ్లాట్ ఉన్న భరత్ జైన్ అనే బిచ్చగాడు మన దేశంలోని బిచ్చగాళ్లందరిలోకీ ధనవంతుడని పేపర్లు, టీవీల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ రేంజ్ బిచ్చగాడి కథ ఇంకోటి వెలుగులోకి వచ్చింది. ఈ బిచ్చగాడికి ఏకంగా 10 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. అడుక్కోవడానికి దుబాయి వెళ్తే అక్కడ పోలీసులు పట్టుకున్నారు.
గల్ఫ్ దేశాల్లో భిక్షాటన నిషేధం. ముఖ్యంగా కువైట్, బహ్రయిన్, ఖతర్, ఒమన్, సౌదీల్లో ఇది మరింత కఠినంగా అమలవుతుంది. అయితే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు పెద్ద ఎత్తున దానధర్మాలు చేస్తారు కాబట్టి ఆ నెలలో గల్ఫ్ దేశాల్లో భిక్షాటన కనిపిస్తుంది. ఆ సమయంలో కేవలం భిక్షాటనతో భారీగా సంపాదించవచ్చనే ఉద్దేశంతో ఏటా ఇతర దేశాల నుంచి కొందరు విమానాల్లో వస్తారు. అదే సమయంలో యాచకులను పట్టుకోవడం కోసం పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు పెడతారు.
తాజగా కువైట్ లో ఒక మసీదు వద్ద ఓ వ్యక్తి యాచిస్తుండగా పోలీసులు చూశారు... తాను నిరుపేదనని... ఉండడానికి ఇల్లు లేదు.. తినడానికి తిండి లేదని దీనంగా యాచిస్తున్న ఆ వ్యక్తిని పట్టుకున్నారు. భిక్షాటనపై నిషేధం ఉండడంతో పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అరెస్టు చేసి జైళ్లో పెట్టారు. అక్కడ విచారించగా పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాకయిపోయింది. విదేశస్థుడైన ఆ బిచ్చగాడి ఖాతాలో సుమారు 6 లక్షల కువైట్ దీనార్లున్నాయట... దాని విలువ ఇండియన్ కరెన్సీలో 10 కోట్ల రూపాయల పైమాటే.