Begin typing your search above and press return to search.
మొగుడుపెళ్లాల గొడవతో నేలకు దిగిన విమానం
By: Tupaki Desk | 9 July 2015 3:42 PM GMTఅప్పుడప్పుడు విమానాలను అత్యవసరంగా కిందకు దించుతారు... దానికి కారణాలుంటాయి.. వాతావరణం అనుకూలించనప్పుడు ఇంధనం అయిపోవాల్సివచ్చినప్పుడు.... సాంకేతికలోపాలు తలెత్తినప్పుడు ఇలా చేస్తారు. కానీ... లండన్ నుంచి హ్యూస్టన్ వెళ్తున్న ఓ విమానం మాత్రం మొగుడుపెళ్లాల గొడవ కారణంగా కిందకు దించాల్సివచ్చింది. అవును... ఆ విమానమెక్కిన ఓ జంట కాసేపటికే గొడవ ప్రారంభించారు. కోపంలో భర్త భార్యపై చేయిచేసుకున్నాడు కూడా. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో పైలెట్ విమానాన్ని కిందకు దించేశాడు.
బ్రిటన్‌లోని మాంచెష్టర్‌కు చెందిన డారెన్ హలివేల్ అనే వ్యక్తి భార్యతో సహా విమానమెక్కాడు... అయితే కాసేపటికే ఇద్దరి మధ్య వాదన మొదలైంది... అది చినికిచినికి గాలివానగా మారింది... కోపంలో డారెన్ తన భార్య జుత్తు పట్టుకుని కొట్టాడు. ఆ దెబ్బకు విమానంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా బోస్టన్‌లో దించేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్తను అరెస్టు చేశారు. భార్యపై దాడి చేయడంతో పాటు మిగతావారికి ఇబ్బంది కలిగించడం.... విమాన సేవలకు విఘాతం కలిగించడం వంటి ఆరోపణలతో కేసులు పెట్టారు.