Begin typing your search above and press return to search.
వారిని చూసి రాక్షసులూ భయపడతారు
By: Tupaki Desk | 13 July 2015 5:57 AM GMTఐఎస్ ఐఎస్... ఈ పేరు వింటే ఇప్పుడు ప్రపంచం వణుకుతోంది. ఈ ఉగ్రవాదులు రాక్షసులకే రాక్షసులు.. మానవత్వం అనేది వారిలో రవ్వంత కూడా లేదు... మనుషులను నిర్దాక్షిణ్యంగా, కిరాతకంగా చంపడమే కాకుండా వాటిని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడం వీరికే చెల్లింది. తాజాగా ఈ రాక్షస మూక ఏడాది కిందట సాగించిన దుండగానికి సంబంధించిన వీడియోను బయటపెట్టారు.. ఇది ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది.
ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు గత ఏడాది జూన్ లో 1700 మంది ఇరాక్ సైనికులను ఒకేసారి చంపేశారు. వారందరినీ వరుసగా నిల్చోబెట్టి పిట్టలను కాల్చినట్లు కాల్చేశారు. మెషిన్ గన్లతో వారి శరీరాలను జల్లెడలా మార్చేశారు. తమను వదిలేయాలని... పొట్టకూటి కోసం సైన్యంలో చేరామంటూ కాళ్లావేళ్లా ప్రాథేయపడిన ఇరాక్ సైనికుల పట్ల వికటాట్టహాసాలు చేస్తూ తూటాల వర్షం కురిపించిన ఈ దారుణ ఘటనకు సంబంధించి 22 నిముషాల నిడివి గల వీడియో ను విడుదల చేశారు.
వేల మందిని ఒకేసారి అత్యంత పాశవికంగా చంపడమే దారుణమైతే వారి శవాలనూ ఇష్టారాజ్యంగా విసిరేసి చిందరవందరగా చేయడం ఆ వీడియోను చూసిన వారిని కలచివేసింది. టిక్రిత్ సమీపంలోని సైనిక స్థావరంపై దాడిచేసి వారిని బందీలుగా తీసుకెళ్లి మరీ కాల్చేశారు. కాగా ఈ ఊచకోతకు కారకులైన 24 మంది ఉగ్రవాదులకు బాగ్దాద్ కోర్టు ఉరిశిక్ష వేసింది.