Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ ప్రైజ్‌ కింద బానిస మహిళ!

By:  Tupaki Desk   |   25 Jun 2015 9:20 AM IST
ఫస్ట్‌ ప్రైజ్‌ కింద బానిస మహిళ!
X
నరరూప రాక్షసులన్న మాటకు నిలువెత్తు నిదర్శనమైన ఇస్లామిక్‌ స్టేట్‌ మరో ఆరాచకానికి పాల్పడుతుంది. మత ఛాందసాన్ని నిలువెల్లా నింపుకొని.. అత్యంత దారుణంగా.. దుర్మార్గంగా వ్యవహరించే ఈ ఐఎస్‌ తీవ్రవాదులు మరో ఆరాచకానికి ఒడిగడుతున్నారు. ఇప్పటికే తమ వద్ద బంధీలుగా ఉన్న వారి విషయంలో అత్యంత క్రూరంగా వ్యవహరించే ఈ ఉగ్రవాదుల గుంపు.. దారుణమైన శిక్షలు విధిస్తూ ప్రాణాలు తీయటం తెలిసిందే.

రంజాన్‌ మాసం సందర్భంగా ఐఎస్‌ ఉగ్రవాదులు మరో ఘోర కలికి ఒడిగడుతున్నారు. ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్‌ పఠనం పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో విజేతగా నిలిచిన వ్యక్తికి బానిస మహిళను బహుమతిగా ఇస్తామని చెబుతున్నారు. రంజాన్‌ మాసం సందర్భంగా ఈ పోటీని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.

ఈ పోటీలో ప్రధమస్థానం పొందిన వ్యక్తికి బానిస మహిళను బహుమతిగా ఇస్తూ.. తర్వాతి స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతి ఇస్తామంటున్నారు. ఐఎస్‌ తీవ్రవాదులకు చెందిన ఈ ప్రకటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.