Begin typing your search above and press return to search.

రంజాన్‌ మాసంలోనూ దేశదేశాల్లో ఉగ్రబాంబులు

By:  Tupaki Desk   |   27 Jun 2015 5:55 AM GMT
రంజాన్‌ మాసంలోనూ దేశదేశాల్లో ఉగ్రబాంబులు
X
ముస్లింలకు రంజాన్‌ మాసం అత్యంత పవిత్రమైనది. ఆ సమయంలో ఎన్ని పోరాటాలు చేసే వారు అయినా శాంతంగా ఉంటారు. ఓర్పుగా వ్యవహరిస్తుంటారు. ఆందోళనలు.. పోరాటాలు పక్కన పెట్టి దైవధ్యానంలో మునిగిపోతారు. కానీ.. తమ రాక్షసకాండతో మానవత్వం అన్నది లేని ఉగ్రరాక్షసులకు ప్రతిరూపంగా నిలిచే ఇస్లామిక్‌స్టేట్‌ తీవ్రవాదులు ఈ శుక్రవారం పలు దేశాల్లో విరుచుకుపడ్డారు. వందలాది మంది అమాయకుల ప్రాణాలు తీసి తమ రక్తదాహానికి అంతు లేదని చాటా చెప్పారు.

ఒకపక్క రంజాన్‌ మాసం. మరోపక్క ముస్లింలు అత్యంత ఇష్టంగా ఉండే శుక్రవారం. ఇలాంటి రోజున పలు దేశాల్లో ఉగ్రభూతంతో తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. సిరియా.. కువైట్‌.. దుబాయ్‌.. ఫ్రాన్స్‌ దేశాల్లో మారణకాండ చోటు చేసుకుంది. ఒకే రోజున పలు దేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడి ప్రపంచ శాంతికి తాము ఒక సవాల్‌ అన్న విషయాన్ని ఐఎస్‌ తీవ్రవాదులు చెప్పకనే చెప్పేశారు.

సిరియాలోని కోబేన్‌ పట్టణంపై దాడి చేసి ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులు మొత్తం 146 మంది అమాయకుల ప్రాణాల్ని తీసేశారు. దీంతో ఆ పట్టణం శవాలదిబ్బగా మారిపోయిన పరిస్థితి. పట్టణంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు.. భవనాల మీదకు ఎక్కి విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు.

ఇక.. ఉత్తర ఆఫ్రికా లోని ట్యూనిషియాలో ఒక ఉగ్రవాది చేసిన దాడి కారణంగా ఏకంగా 28 మంది మరణించిన దుస్థితి. సూసీ జిల్లాలోని మర్హాబా లోని ఒక హోటల్‌లోకి ప్రవేశించిన తీవ్రవాది.. కాల్పుల కారణంగా భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంది.

కువైట్‌లో షియాలకు చెందిన ఒక మసీదులో ఆత్మాహుతిదాడికి తీవ్రవాదులు పాల్పడ్డారు. ఈ ఘటనలో 25 మంది మరణిస్తే.. 202 మంది గాయపడ్డారు. దాడికి పాల్పిడింది తామేనని ఒక ఉగ్రవాద సంస్థ వెల్లడించింది.

యూరప్‌లోని ఫ్రాన్స్‌ తూర్పు ప్రాంతంలోని సెయింట్‌ క్వీన్‌టిన్‌ ఫాలవీర్‌ అనే పట్టణంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన ఒక గ్యాస్‌ ఫ్యాక్టరీలోకి ఇద్దరు తీవ్రవాదులు కారులో దూసుకొచ్చి ఢీ కొట్టారు. దీంతో అక్కడ చోటు చేసుకున్న పేలుడుతో పలువురు మరణానికి కారకులయ్యారు. ఈ ఘటన సందర్భంగా ఉగ్రవాదులు ఎంత కర్కసంగా వ్యవహరిచారంటే.. ఒక వ్యక్తి తలను ఫ్యాక్టరీ గేటుకు పెట్టి.. దేహాన్ని వేరు చేసి పడేశారు.