Begin typing your search above and press return to search.
మధ్యాహ్నం కుక్క అరిస్తే యజమానికి బ్యాండ్!
By: Tupaki Desk | 24 July 2015 9:49 AM GMTకాపలాకు పెట్టుకునే కుక్కలు ఎప్పుడు అరుస్తాయో? ఎప్పుడు కామ్ గా ఉంటాయో చెప్పలేం? కఒత్తవరు కనిపిస్తే చాలు.. అరుపులతో దద్దరిల్లేలా చేయటం మామూలే. అయితే.. కుక్కల్ని అరవకుండా చూడాలంటూ ప్రభుత్వం ఆర్డరు పాస్ చేయటమే కాదు.. ఒకవేళ మీ ఇంట్లో కుక్క అరిస్తే భారీ జరిమానా? అంటే.. సినిమా కనిపించటం ఖాయం.
తాజాగా అలాంటి చిత్రమైన రూల్ ఒకటి తీసుకొచ్చి జనాలకు పిచ్చెక్కిపోయేలా చేస్తోంది ఇటలీలోని ఒక స్థానిక ప్రభుత్వం. ఆ దేశంలోని కంట్రోస్ అనే ప్రాంతం ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యింది. ఆ ప్రాంతంలోని వారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కచ్ఛితంగా నిద్ర పోవాలని.. ఆ సమయంలో షాపులు.. ఆఫీసులు.. స్కూళ్లు లాంటివేమీ పని చేయకూడదని ఆర్డర్ పాస్ చేయటం తెలిసిందే.
మధ్యాహ్నం కునుకు తీయటానికి అధికారికంగానే ఆర్డర్‌రావటం కాస్తంత హ్యాపీగా కొందరికి అనిపించినా.. తాజాగా తీసుకొచ్చిన రూల్ చూసి మాత్రం అక్కడి ప్రజలు బిత్తర పోతున్నారు.
స్థానిక ప్రభుత్వం పేర్కొన్నతాజా నిబంధన ఏమిటంటే.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో పెంపుడు కుక్కలేవీ అరవకుండా చూసుకోవాల్సిన బాధ్యత సదరు యజమానిదేనని తేల్చేసింది.
ఒకవేళ కుక్కలు కాని అరిస్తే.. అందుకు విధించే జరిమానాను వెల్లడించింది. కుక్క అరవటం ద్వారా పక్కవారికి నిద్రా భంగం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి రూ.1400 నుంచి రూ35వేల మధ్యలో జరిమానా విధిస్తామని పేర్కొంటున్నారు. కుక్కలు అరవకుండా ఎలా అంటే.. అది మీ కష్టం.. మాకు సంబంధం లేదని తేల్చి చెబుతున్నారట.