Begin typing your search above and press return to search.
వారున్నారా... ఉంటే ఎక్కడున్నారు?
By: Tupaki Desk | 29 July 2015 4:05 AM GMTగతకొన్ని సంవత్సరాలుగా మనిషికి ఒక కొత్తకోరిక, వింత కోరిక ఒకటి కలిగింది! అది ఊహకు - భ్రమకు మధ్య కోరికేనా లేక ఊహకు - వాస్తవానికి మధ్య కొట్టిమిట్టాడుతున్న కోరిక అనేది తెలియడానికి చాలా సమయమే పట్టొచ్చు!! ఈ అనంత విశ్వంలో భూమి అనే గ్రహంపై జీవికోటిమనుగడకు ఆస్కారం ఉండడంతో... ఇటువంటి నివాసయోగ్యమైన గ్రహాలు మరెన్ని ఉన్నాయని... కనీసం మరొక్కటి అయినా ఉండి ఉంటుందని, ఉండాలని ఊహించాడు, కోరుకున్నాడు! ఈ క్రమంలో రోజు రోజుకీ గ్రహాంతర జీవులు, వాటి నివాస ప్రాంతంపై ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నాడు!
ఇదే కోరికకు ఊతమిచ్చేలా... కెప్లర్ టెలీస్కోప్ సహాయంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఎర్త్ - 2 కి సంబందించిన కొన్ని విషయాలు వెల్లడించింది. వీరి పరిశోదనల్లో దొరికిన ఒక కొత్తగ్రహానికి కెప్లర్-452 అని నామకరణం చేశారు. దీన్నే ఎర్త్ - 2 అని కూడా పిలుస్తుంటారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆసక్తి కనిపిస్తోంది! "మరో భూమా..." అని తాజాగా చైనీయులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు! దీనికి తాజా ఉదాహరణ... సినా వైబో అనే చైనా సోషల్ నెట్ వర్క్ లో ఈ డిస్కవరీపై సుమారు 4.4 కోట్ల మంది ఉత్సాహం చూపించడమే! ఇదే సమయంలో సుమారు లక్ష మంది ఈ విషయలపై చర్చించడానికి ఆసక్తి చూపించారు! అయితే తాజాగా.... సెటీ శాస్త్ర వేత్తలు కెప్లర్ - 452 చూడటానికి భూమిలాంటి గ్రహమే అయినప్పటికీ మానవ నివాసయోగ్యం కాదని తేల్చేశారు!
అయినా కూడా ఏదో ఆశతో ఉన్న చైనా... ప్రపంచంలోనే అతిపెద్ద టెలీస్కోప్ ని తయారుచేసే పనిలో బిజీ బిజీ గా ఉంది! "ఫాస్ట్" అని ఈ భారీ టెలీస్కోప్ కి నామకరణం చేసింది! 2011లో ప్రారంభమైన దీని నిర్మాణం వచ్చే ఏడాది చివరికల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయి! సహజసిద్ధంగా ఏర్పడిన ఒక లోయలాంటి ప్రాంతంలో 500 మీటర్ల రిఫ్లాక్టార్ వ్యాసం కలిగిన ఈ బారీ టెలీస్కోప్ ని నిర్మానిస్తున్నారు! దీని నిర్మాణం పూర్తయితే... విశ్వానికి సంబందించిన బలమైన శక్తి, సమాచారం చైనా చేతిలో ఉన్నట్లే! ఈ టేలీస్కోప్ ను కూడా ముఖ్యంగా గ్రహాంతరజీవుల అన్వేషణ కోసమే నిర్మిస్తున్నారు! ఆ స్థాయిలో ప్రపంచానికి ఇప్పుడు "మరో జీవి..." పై ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది!