Begin typing your search above and press return to search.

సెల్ఫీ విత్ స్నేక్... సరదా తీర్చేసింది!

By:  Tupaki Desk   |   24 July 2015 4:09 PM GMT
సెల్ఫీ విత్ స్నేక్... సరదా తీర్చేసింది!
X
మొదట్లో సరదాగా ఉండే సెల్ఫీ ఆనందం కాస్త... పిచ్చిగా మారిపోతుంది! కాదేదీ సెల్ఫీకి అనర్హం అని భావించిన సెల్ఫీ పిచ్చోళ్లు కొంతమంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటే... మరికొంతమంది ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు! చనిపోయిన తాతతో సెల్ఫీ దిగేవాడు ఒకడైతే... ఆపరేషన్ థియేటర్లో డెలివరీ కేస్ హ్యాండిల్ చేస్తూ కూడా సెల్ఫీ దిగే మూర్ఖుడు మరొకడు! ఇలా సెల్ఫీ... ఒక అంటువ్యాదిలా, అనాలోచిన పనికి అడ్రస్ గా తయారయ్యింది!

అయితే ఇదేస్థాయి పిచ్చితో ఒక పెద్దయన ప్రాణాలమీదకి తెచ్చుకుని, సుమారు కోటి రూపాయలు వదిలించుకున్నాడు! అమెరికాలోని శాండియాగోలో టాడ్ ఫాస్లర్ అనే వ్యక్తి పెద్ద పాముతో సెల్ఫీ దిగాలని మోజుపడ్డాడు! అయితే అది పూర్తిగా విషసర్పం! సెల్ఫీ ఆనందం ఈయనకి కానీ... ఆ పాముకి కాదు కదా... నా పుట్టలో వేళుపెడితే కుట్టనా అన్నట్లు అతడి భుజంపై ఒక్క కాటువేసింది! అంతే... ఇతగాడి వయసు ప్రభావమో, ఆపాము విషయ ప్రభావమో కానీ... వెంటనే అతడి భుజం మొత్తం ఇంఫెక్షన్ వచ్చేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇతడిని ఆసుపత్రిలో చేర్పించారు! ఆఖరికి ఏదోలా ప్రాణాలతొ బయటపడ్డాడు కానీ... ఆ హాస్పటల్ బిల్లు చూశాక ఆ ఆనందం కాస్త నిమిషాల్లో ఆవిరైపోయిందట!

అన్ని ఖర్చులూ కలిపి ఆ బిల్లులో 1,53,000 డాలర్లు వేశారట! భారతీయ కరెన్సీలో అది అక్షరాలా రూ. 97,57,575... కాస్త అటు ఇటుగా కోటిరూపాయలు!! ఈ విషయం తెలుసుకుని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసే ముందు ఆలోచించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!