Begin typing your search above and press return to search.
అద్భుతం: కూలిన విమానంలో బతికిన ఆ ఇద్దరూ
By: Tupaki Desk | 25 Jun 2015 9:19 AM GMTవిమానం కూలిపోతే ప్రాణాలతో బయటపడటం అన్నది సాధ్యం కాదు. అందులోకి విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైతే.. ఏ ఒక్కరూ తప్పించుకునే ఛాన్స్ ఉండదు. అలాంటిది కొలంబియాలో మాత్రం అందుకు భిన్నమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. విమాన ప్రమాదం చోటు చేసుకున్న కొద్ది రోజుల తర్వాత బతికి బయటపడ్డ తల్లిబిడ్డలు ఇప్పడు అందరికి ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.
కొలంబియాలో చోటు చేసుకున్న ఈ అద్భుత ఘటన వివరాల్లోకి వెళితే..కొన్ని రోజుల క్రితం అక్కడ ఓ విమానం కూలిపోయింది. పైలట్‌తో సహా ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. అయితే.. ఇద్దరి ఆచూకీ మాత్రం మిస్ అయ్యింది.
వాయువ్య కొలంబియాలో నూక్వి.. క్విబోడ్ మధ్య ప్రయాణిస్తున్న ఈ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఇందులో మిస్ అయిన ఇద్దరి జాడ కోసం విపరీతంగా గాలింపు చర్యలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.
ఊహించని విధంగా బుధవారం వారి జాడ సహాయక బృందానికి లభించింది. విమాన ప్రమాదం నుంచి 18 ఏల్ల నెల్లీ అనే యువతిని.. ఆమె ఏడాది కొడుకును సహాయక బృందం రక్షించి తీసుకెళ్లారు. వారికి స్వల్పగాయాలు కావటంతో వారికి చికిత్స చేస్తున్నారు. విమానం కూలిపోయిన ఘటనలో బతికి బయటపడ్టం అద్భుతంగా పలువురు అభివర్ణిస్తున్నారు.