Begin typing your search above and press return to search.
సింగపూర్‌లో పాస్ అయ్యిందే
By: Tupaki Desk | 9 Jun 2015 8:53 AM GMTరెండు నిమిషాల మ్యాగీ మీద దేశ వ్యాప్తంగా సాగుతున్న రచ్చ అంతాఇంతా కాదు. పలు రాష్ట్రాల్లో మ్యాగీ ఉత్పత్తుల్ని నిషేధించటం తెలిసిందే. చివరకు తమ ఉత్పత్తిని వెనక్కి తీసుకుంటున్నట్లు మ్యాగీ స్వయంగా ప్రకటించిన పరిస్థితి. ఆరోగ్యాన్ని దెబ్బ తీసే రసాయనాల వినియోగం అనుమతులకు మించి ఉందన్న విషయం పలు పరీక్షల్లో తేలిన విషయం తెలిసిందే.
నాణ్యతా పరమైన అంశాల్లో భారత్‌లో మ్యాగీ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. పలుదేశాల్లో మ్యాగీ నాణ్యతపై పరీక్షలు నిర్వహిస్తన్నారు. తాజాగా సింగపూర్ దేశంలో మ్యాగీపై నాణ్యతా పరీక్షలు నిర్వహించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారతదేశంలో ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటున్న మ్యాగీ సింగపూర్ దేశంలో నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో పాస్ అయ్యింది. ఆ దేశంలో నాణ్యత ప్రమాణాలకు తగ్గట్లే మ్యాగీ ఉందని తేల్చారు.
చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పే సింగపూర్ లాంటి దేశంలో మ్యాగీ నాణ్యత పరీక్షలు పాస్ అయి.. ఇండియాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉండటం ఏమిటన్నది మ్యాగీ ఉత్పత్తిదారు నెస్లే సమాధానం చెబితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.