7/G బాక్సాఫీస్.. సైలెంట్ గా రికార్డ్ బ్రేక్!
సౌత్ లో కల్ట్ క్లాసిక్ మూవీగా ఇప్పటికి అందరికి గుర్తుండిపోయే సినిమా 7/G బృందావన్ కాలనీ.
By: Tupaki Desk | 27 Sep 2023 1:30 PM GMTసౌత్ లో కల్ట్ క్లాసిక్ మూవీగా ఇప్పటికి అందరికి గుర్తుండిపోయే సినిమా 7/G బృందావన్ కాలనీ. ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సెల్వన్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తమిళంలో కంటే తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. గత కొంతకాలంగా టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే.
స్టార్ హీరోల బర్త్ డే కి ఫ్యాన్స్ షోలుగా మొదలైన ఓల్డ్ మూవీస్ రీరిలీజ్ ట్రెండ్ డబ్బింగ్ సినిమాల వరకు వచ్చింది. పోకిరి చిత్రంతో కరోనా వేవ్ తర్వాత ఈ పాత సినిమాలని రీరిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ చిత్రానికి మంచి ఆదరణ రావడంతో తరువాత, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు సినిమాలు రీరిలీజ్ చేస్తూ వచ్చారు. వీటిలో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా పవన్ కళ్యాణ్ ఖుషి నిలిచింది.
ఈ సినిమా ఓవరాల్ గా 7.8 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి టాప్ లో ఉంది. తరువాత ఏ సినిమాలు కూడా ఖుషి రికార్డుని కూడా సమీపించలేకపోయాయి. ఇప్పుడు టాప్ 10 రీరిలీజ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో 7/G బృందావన్ కాలనీ కూడా చేరడం విశేషం. ఈ సినిమా 2.2 కోట్ల గ్రాస్ తో టాప్ 9లో ఉంది. ఖుషి తర్వాత రెండో స్థానంలో మహేష్ బాబు బిజినెస్ మెన్ 5.5 కోట్ల కలెక్షన్స్ తో నిలిచింది. మూడో స్థానంలో సింహాద్రి ఉంది.
ఈ చిత్రం 5.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక చిన్న సినిమా అయిన ఈ నగరానికి ఏమైంది మూవీకి రీరిలీజ్ లో యూత్ బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం ఏకంగా 3.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ ఆరెంజ్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఏకంగా 3.4 కోట్ల గ్రాస్ మూవీ అందుకుంది. పవన్ కళ్యాణ్ జల్సా చిత్రానికి 3.3 కోట్లు వచ్చాయి.
సూర్య డబ్బింగ్ మూవీ సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా రీరిలీజ్ లో ఏకంగా 2.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. దీని తర్వాత ఒక్కడు 2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో ఎనిమిదో స్థానంలో ఉంది. తొమ్మిదో స్థానంలో 7/G బృందావన్ కాలనీ చిత్రం నిలవడం విశేషం.