Begin typing your search above and press return to search.

బేబీ బాక్సాఫీస్.. 2వ రోజు ఎంతంటే..

Baby Movie Collections

By:  Tupaki Desk   |   16 July 2023 7:39 AM GMT
బేబీ బాక్సాఫీస్.. 2వ రోజు ఎంతంటే..
X

ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య నటించిన బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ వెళుతుంది. మొదటి రోజు ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. చిత్ర యూనిట్ సినిమాకు పాజిటివ్ టాక్ రావాలి అని ముందుగానే ప్రీమియర్ షో లతో రిస్క్ చేసి గట్టిగానే విడుదల చేసింది. ఇక ప్రీమియర్ షోలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మొదటి రోజు భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ వచ్చాయి.

ఎంతగా అంటే చిన్న సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా బేబీ సినిమా ఒక రికార్డు అయితే నెలకొల్పింది. ఇక ఈ సినిమా మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 2.60 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకుంది. రెండవ రోజు కూడా సినిమాకు అంతకుమించి అనేలా షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బేబీ సినిమా రెండవ రోజు 2.98 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సాధించింది.

ఇక ఎక్కువగా అయితే నైజం ఏరియాలో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ అయితే పెరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర గుంటూరులో కూడా నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు రోజుల్లో కలుపుకొని ఈ సినిమా 5.58 కోట్ల షేర్, 9.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 26 లక్షల షేర్ రాగా ఓవర్సీస్ లో ఇప్పటివరకు 1.20 కోట్ల షేర్ దక్కింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా బేబీ సినిమా రెండు రోజుల్లో 7 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ 14.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొత్తంగా అయితే 7.40 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. అంటే బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 8 కోట్ల టార్గెట్ ను అందుకోవాల్సి ఉంటుంది.

ఇక ఇప్పటివరకు ఈ సినిమా 7 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది. అంటే మరో కోటి రూపాయలు అందుకుంటే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినట్లు లెక్క. ఇప్పటికే నిర్మాత ప్రాఫిట్ లోకి వచ్చేసాడు. ఎందుకంటే నాన్ థియేట్రికల్ గానే ఈ సినిమాకు దాదాపు 7 కోట్లు వచ్చాయి. ఇక ఆదివారం రోజు నుంచి రాబోయే కలెక్షన్స్ అన్ని కూడా నిర్మాతకు బోనస్ అనే చెప్పాలి.