Begin typing your search above and press return to search.

బేబీ.. ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే!

ఆనంద్ దేవరకొండకు మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మొదటి సక్సెస్ అయితే దక్కింది.

By:  Tupaki Desk   |   16 July 2023 1:21 PM GMT
బేబీ.. ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే!
X

ఆనంద్ దేవరకొండకు మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మొదటి సక్సెస్ అయితే దక్కింది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా మరొక ముఖ్యమైన పాత్రలో విరాజ్ అశ్విన్ నటించాడు. ఇక ఈ సినిమా ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద మొదట్లోనే మంచి టాక్ సొంతం చేసుకుంది.

ముందుగా ప్రీమియర్ షోలను ప్రదర్శించగా సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశారు. ఇక మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా కొన్ని మేజర్ ఏరియాలో కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దర్శనమిచ్చింది. ఇక బేబీ సినిమా డీసెంట్ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

మొదటి రోజు అయితే చిన్న సినిమాలో రికార్డులలో ఇదే బెస్ట్ రికార్డుగా నిలిచింది. అత్యధిక స్థాయిలో మంచి ఓపెనింగ్స్ అందుకున్న బెస్ట్ మినీ టాలీవుడ్ సినిమాల్లో కూడా ఒకటిగా నిలిచింది. అయితే బేబీ సినిమా దాదాపు ప్రాఫిట్ జోన్ లోకి దగ్గరగా వచ్చేసింది. అయితే అన్ని ఏరియాలో కంటే ముందుగా నైజాం ఏరియాలో ఈ సినిమా ప్రాఫిట్ జాన్ లోకి వచ్చేసింది.

నైజాం మీడియాలో 2.25 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పుడు రెండో రోజుల్లోనే టార్గెట్ ను ఫినిష్ చేసి 2.5 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే అందుకుంది. నైజం ఏరియాలో ఇటీవల చాలా తొందరగా బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాల్లో ఒకటిగా బేబీ ఒక కొత్త రికార్డును అయితే క్రియేట్ చేసింది.

నిర్మాత ఎస్కేఎన్ చాలా పకడ్బందీగా ప్లానింగ్ తోనే ఈ సినిమాను విడుదల చేశారు. ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ అయితే ఏమాత్రం తగ్గడం లేదు. మొదట A సెంటర్స్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత మిగతా సెంటర్లలో కూడా రోజురోజుకు క్రేజ్ పెరిగిపోవడంతో కలెక్షన్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఆదివారం రోజు ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. మరి మొత్తంగా బేబీ ఏ స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.