Begin typing your search above and press return to search.

బేబీ 5వ రోజు బాక్సాఫీస్.. ఫస్ట్ డే కంటే ఎక్కువే..

ఆనంద్ దేవరకొండకు మొత్తానికి బాక్సాఫీస్ వద్ద

By:  Tupaki Desk   |   19 July 2023 7:14 AM GMT
బేబీ 5వ రోజు బాక్సాఫీస్.. ఫస్ట్ డే కంటే ఎక్కువే..
X

ఆనంద్ దేవరకొండకు మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మొదటిసారి ఊహించని స్థాయిలో సక్సెస్ అయితే లభించింది. అలాగే మొదటిసారి హీరోయిన్ గా కనిపించిన వైష్ణవి చైతన్య కూడా ఎప్పటికి గుర్తుండిపోయేలా మొదట్లోనే మంచి విజయాన్ని చూసింది. ఇక దర్శకుడు సాయి రాజేష్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. ఇక మరోవైపు నిర్మాత SKN అయితే ప్రాఫిట్స్ జోష్ తో కనిపిస్తూ ఉన్నాడు.

సాధారణంగా ఎప్పుడు ఫుల్ జోష్ తోనే కనిపించే SKN ఇప్పుడు ప్రాఫిట్స్ తో మరింత జోష్ టెజో కనిపిస్తూ.. అందరినీ ఆశ్చర్య పోయేలా చేస్తున్నాడు. బేబీ సినిమా మొదటి రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుందో అలాగే ఐదవ రోజు కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది.

మొదటిరోజు బేబీ సినిమాకు ఏపీ తెలంగాణలో 2.60 కోట్లు, రెండవ రోజు 2.98 కోట్లు, మూడవ రోజు 3.77 కోట్లు, నాలుగో రోజు 3.72 కోట్లు ఐదవ రోజు 2.94 కోట్లు వచ్చాయి. ఈ విధంగా ఏపీ తెలంగాణలో కలుపుకొని మొత్తంగా ఐదు రోజుల్లో అయితే బేబీ సినిమాకు 16.01 కోట్లు షేర్, 28.15 కోట్లు గ్రాస్ వచ్చింది. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ ఉండడం విశేషం.

చాలా ఏరియాలలో ఇప్పటికీ కూడా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంలో చూసుకుంటే 70 లక్షల షేర్ ఓవర్సీస్ లో 2 కోట్ల మార్కును ఈ సినిమా అందుకుంది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు బేబీ సినిమా ఐదు రోజుల్లో 18.71 కోట్లు షేర్, 34.90 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక ఈ సినిమా 7.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా ఎనిమిది కోట్ల టార్గెట్ ఫిక్స్ అయింది.

మొత్తంగా బేబీ సినిమా 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 18.71 కోట్లు షేర్ రాబట్టింది. అంటే ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి కంటే ఈ సినిమా ఎక్కువ స్థాయిలో రాబట్టి 10 కోట్లకు పైగా ప్రాఫిట్ తో కొనసాగుతోంది. ఇక ఈ వీకెండ్ చివరి వరకు కూడా సినిమా భారీ స్థాయిలోనే కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇక నిర్మాత SKN ఈ సినిమాతో అతని జీవితంలోనే మొట్టమొదటిసారి అత్యధిక స్థాయిలో ప్రాఫిట్స్ అందుకోబోతున్నాడు.