Begin typing your search above and press return to search.

10వ రోజు కూడా బాక్సాఫీస్ షేక్.. బేబీ లెక్క తగ్గట్లే!

సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా

By:  Tupaki Desk   |   24 July 2023 9:48 AM GMT
10వ రోజు కూడా బాక్సాఫీస్ షేక్.. బేబీ లెక్క తగ్గట్లే!
X

బేబీ సినిమా విడుదలకు ముందు ఏదో పాజిటివ్ గా అందుకని ఒక వీకెండ్ అనంతరం పెట్టిన పెట్టబడిన వెనక్కి తెచ్చుకుంటుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా అసలు ఊహలకందని స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అయితే అందుకుంటోంది. మొదటి వీకెండ్ తర్వాత కూడా నార్మల్ డేస్ లో మంచి కలెక్షన్స్ రాబట్టిన బేబీ సినిమా సెకండ్ వీకెండ్ కూడా మంచి ప్రాఫిట్స్ అయితే అందుకుంది.

సినిమాకు పోటీగా కూడా ఇతర సినిమాలు కూడా లేకపోవడంతో కావలసినంత రాబట్టుకుంది అనే చెప్పాలి. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేటి తరం యువతకు బాగా కనెక్ట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. మొదటి రోజు 2.60 కోట్లు అందుకున్న బేబీ సినిమా 10వ రోజు అంతకంటే ఎక్కువగా 3.40 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవడంతో ఈ సినిమా యువతకు ఎంత బాగా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 10 రోజుల్లో బేబీ సినిమాకు 27.85 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఏపీ తెలంగాణలో 51 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే దాటింది. చిన్న సినిమాల్లో అత్యధిక స్థాయిలో అతివేగంగా 50 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమాగా కూడా బేబీ రికార్డును క్రియేట్ చేసింది. కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాకు 1.48 కోట్లు రాగా, ఓవర్సీస్ లో ఇప్పటివరకు 2.38 కోట్లు వచ్చాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పది రోజుల్లో బేబీ సినిమా 31.70 కోట్ల షేర్ కలెక్షన్స్, 60.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాను SKN నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 7.40 కోట్లు కాగా బాక్స్ ఆఫీస్ వద్ద 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బేబీ విడుదల అయింది.

ఇక మొత్తంగా ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ తో చూసుకుంటే బేబీ సినిమా 23 కోట్ల కు పైగా ప్రాఫిట్స్ అయితే అందించింది. 10వ రోజు సండే కావడంతో చాలా ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డులు కూడా దర్శనమిచ్చాయి. ఇక ఈ వీకెండ్ అనంతరం సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.