బేబీ 50 కోట్ల బ్లాస్ట్.. ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్ ఎంతంటే?
పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా విడుదల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన రికార్డులను అయితే క్రియేట్ చేస్తోంది.
By: Tupaki Desk | 23 July 2023 9:42 AM GMTపెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా విడుదల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన రికార్డులను అయితే క్రియేట్ చేస్తోంది. చిన్న సినిమాల్లో అత్యధిక స్థాయిలో మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా రోజురోజుకు కలెక్షన్స్ మరింత పెంచుకుంటూ వెళుతోంది. ముఖ్యంగా ఫస్ట్ వీకెండ్ అయితే ఊహించని స్థాయిలోనే కలెక్షన్స్ వచ్చాయి.
ఇక ఫస్ట్ వీక్ తర్వాత కూడా నార్మల్ డేస్ లో ఈ సినిమా అదే తరహాలో ముందుకు దూసుకుపోతూ కనిపించింది. నిర్మాతలకు బయ్యర్లకు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది అని చెప్పాలి. మిగతా సినిమాలు కాస్త పోటికి దిగినా కూడా బేబీ ముందు అసలు ఏమాత్రం పోటీని ఇవ్వలేకపోయాయి ఇక దేవి సినిమాతో ఆనంద్ దేవరకొండకు మాత్రం మంచి సక్సెస్ అయితే దక్కింది.
ఇక ఈ సినిమా ఏకంగా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే దాటేసింది. మొత్తంగా బేబీ సినిమా తొమ్మిది రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. బేబీ సినిమా మొదటి వీకెండ్ లోనే కాకుండా మళ్ళీ సెకండ్ వీకెండ్ లో కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టుకుంటుంది. ఈ సినిమాకు కోటి కంటే తక్కువ షేర్ రావడం లేదు. మినిమం కోటిన్నర రేంజ్ లో అయితే షేర్ కలెక్షన్స్ వస్తున్నాయి.
ఇక శనివారం రోజు కూడా 2కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఆదివారం రోజు ఇంకా లెక్క పెరిగే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బేబీ సినిమా తొమ్మిది రోజుల్లో 22.22 కోట్ల షేర్ కలెక్షన్స్ 37.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని కోటికి పైగా షేర్ అందుకున్న బేబీ సినిమా ఓవర్సీస్లో 2.23 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో బేబీ సినిమాకు 28 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ రాగా మొత్తంగా 53 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. చిన్న సినిమాల్లో ఇటీవల కాలంలో అతివేగంగా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఇది సరికొత్త రికార్డును అయితే క్రియేట్ చేసింది. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 7.40 కోట్ల వరకు జరిగింది. ఇక 8 కోట్ల బ్రేక్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడికి మొత్తం వెనక్కి తీసుకురావడమే కాకుండా 20 కోట్లకు పైగా ప్రాఫిట్స్ అయితే అందించింది.