Begin typing your search above and press return to search.

వర్షాలు పడుతున్నా.. తగ్గని బేబీ కలెక్షన్స్!

ఇటీవల కాలంలో పెట్టిన పెట్టుబడికి ఈ స్థాయిలో లాభాలు ఏ సినిమా కూడా అందించలేదు.

By:  Tupaki Desk   |   26 July 2023 7:46 AM GMT
వర్షాలు పడుతున్నా.. తగ్గని బేబీ కలెక్షన్స్!
X

ఒక సినిమా కంటెంట్ క్లిక్ అయితే బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో బేబీ సినిమా నిరూపించింద. మా సినిమాను కావాలని తొక్కేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, రివ్యూల కారణంగా కలెక్షన్స్ పై ప్రభావం పడింది.. అని ఇలా కామెంట్స్ చేసేవారికి బేబీ సినిమా ఊహించిన విధంగా కౌంటర్ ఇచ్చింది అని చెప్పాలి.

ఎందుకంటే బేబీ సినిమాకు కూడా కాస్త నెగిటివ్ రివ్యూలు నెగిటివ్ కామెంట్స్ కూడా గట్టిగానే వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈ సినిమా రెండవ వారం కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాకు ఎన్ని అవరోధాలు ఏర్పడిన కూడా జనాల సపోర్ట్ అయితే తగ్గదు అని బేబీ సినిమా పర్ఫెక్ట్ గా నిరూపించింది.

ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఏ రేంజ్ లో పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు రాష్ట్రాలలో కూడా చాలావరకు బయటకు వెళ్లొద్దు అని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తోంది. అయినప్పటికీ కూడా ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై ఎక్కువగా అయితే పడలేదు.

బేబీ సినిమా 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.46 కోట్లు తీసుకురాగా 12వ రోజు 1.21 కోట్లు రాబట్టింది. ఇక మొత్తంగా 12 రోజుల్లో బేబీ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 30.52 కోట్ల షేర్ కలెక్షన్స్, 55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 1.64 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఓవర్సీస్ లో 2.44 అందుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా బేబీ సినిమాకు మొత్తంగా 34.60 కోట్లు షేర్ రాగా గ్రాస్ కలెక్షన్స్ 65 కోట్ల దక్కింది. ఒక చిన్న బడ్జెట్ లో వచ్చిన సినిమా ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని ఎవరు ఊహించలేదు.

ఈ సినిమా ఓవరాల్ గా మార్కెట్లో 7.40 కోట్ల రేంజ్ లో అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఎనిమిది కోట్ల వరకు టార్గెట్ ఫిక్స్ కాగా ఇప్పటివరకు 34 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువగా 26.60 కోట్ల షేర్ ప్రాఫిట్ అందుకుంది. ఇటీవల కాలంలో పెట్టిన పెట్టుబడికి ఈ స్థాయిలో లాభాలు ఏ సినిమా కూడా అందించలేదు. ఒక విధంగా నిర్మాత SKN జాక్ పాట్ కొట్టేశాడు అని చెప్పవచ్చు.