Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ 2 రికార్డ్‌ బ్రేక్‌ చేసిన 'బేబీ'

కేజీఎఫ్ 2 సినిమా 12వ రోజు వరకే కోటి కి పైగా షేర్‌ ను సాధిస్తే ఇప్పుడు బేబీ 13వ రోజు కూడా కోటి షేర్‌ ను రాబట్టింది.

By:  Tupaki Desk   |   28 July 2023 3:40 AM GMT
కేజీఎఫ్‌ 2 రికార్డ్‌ బ్రేక్‌ చేసిన బేబీ
X

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ముఖ్య పాత్రల్లో నటించిన బేబీ సినిమా వసూళ్ల వర్షం కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఓ రేంజ్‌ లో వర్షాలు దంచి కొడుతూ వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నా కూడా బేబీకి ఈ రేంజ్ వసూళ్లు ఎలా సాధ్యం అవుతున్నాయో అర్థం కావడం లేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ వర్షాలు లేకుంటే బేబీ సినిమా వంద కోట్ల క్లబ్‌ లో చేరి ఉండేది అనేది కొందరి మాట. ఆ విషయం పక్కన పెడితే బేబీ సినిమా విడుదల అయిన 13వ రోజు కూడా సాలిడ్‌ కలెక్షన్స్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బేబీ 13వ రోజు షేర్‌ కోటి రూపాయలకు పైగా ఉంది. ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద స్టార్‌ హీరోల సినిమాలు అయినా మొదటి వారం వరకు సందడి చేస్తున్నాయి.

రెండో వారంలో కూడా వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. విడుదలైన రోజు నుండి ప్రతి రోజు కోటికి పైగా షేర్‌ సాధిస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా 17 రోజుల పాటు వసూళ్లు సాధిస్తూ వచ్చింది. అంటే 17వ రోజు వరకు ఆర్‌ఆర్ఆర్‌ కోటికి పైగా షేర్‌ ను దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో కేజీఎఫ్‌ 2 సినిమా 12 రోజుల పాటు కోటికి పైగా వసూళ్లు నమోదు చేసింది.

అంటే మొదటి అయిదు పది రోజుల పాటు పదుల కోట్ల షేర్‌ సాధిస్తున్న సినిమాలు ఆ తర్వాత మాత్రం కనీసం కోటి కూడా షేర్ ను దక్కించుకోలేక పోయాయి. కానీ బేబీ మాత్రం 13వ రోజు కూడా కోటి రూపాయల షేర్‌ ను రాబట్టింది. కేజీఎఫ్ 2 సినిమా 12వ రోజు వరకే కోటి కి పైగా షేర్‌ ను సాధిస్తే ఇప్పుడు బేబీ 13వ రోజు కూడా కోటి షేర్‌ ను రాబట్టింది.

నేడు పవన్ కళ్యాణ్ బ్రో సినిమా విడుదల అయ్యింది. బ్రో సినిమా కనుక వచ్చి ఉండకుంటే కచ్చితంగా ఆర్ఆర్‌ఆర్ సినిమా సాధించినట్లుగా 17 రోజుల పాటు కోటికి పైగా షేర్‌ ను దక్కించుకుని నెం.1 స్థానం కే బేబీ ఎసరు పెట్టి ఉండేదేమో అంటూ బాక్సాఫీస్ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి బేబీ 'కేజీఎఫ్ 2' రికార్డ్‌ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది.