భగవంత్ కేసరి కలెక్షన్స్.. రెండు రోజుల్లో హాఫ్ సెంచరీ..
బాక్సాఫీస్ వద్ద రెండు రోజుల్లో రూ. 50 కోట్లకు పైగా సంపాదించినట్లు పోస్ట్ చేసింది.
By: Tupaki Desk | 21 Oct 2023 9:39 AM GMT'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి వరుస బ్లాక్ బాస్టర్స్ తర్వాత ముచ్చటగా మూడోసారి 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్ సక్సెస్‌ను అందుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ సినిమాకు మొదటి రోజే ఫస్ట్ షో నుంచే విశేష స్పందన దక్కింది. తొలి రోజే లియో సినిమాతో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. మంచి ఓపెనింగ్స్‌ను సాధించింది. ఇక రెండో రోజు పోటీ మరింతగా పెరిగినా.. డీసెంట్ కలెక్షన్లను వసూలు చేసింది.
రెండో రోజు అయితే దళపతి విజయ్ 'లియో', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' నుంచి పోటీ ఎదురైనా..మంచిగానే కలెక్షన్స్‌ను నమోదు చేసినట్లు మూవీటీమ్ పేర్కొంది. బాక్సాఫీస్ వద్ద రెండు రోజుల్లో రూ. 50 కోట్లకు పైగా సంపాదించినట్లు పోస్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 51.12 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్లు తెలిపింది.
రెండో రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల విషయానికి వస్తే.. నైజాంలో రూ. 3.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 2. కోట్లు, ఏపీలో రూ.4.09 మొత్తంగా 9.91కోట్ల షేర్ వచ్చింది. ఏపీలో వచ్చేసరికి.. వెజాగ్లో రూ.98 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 68 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, గుంటూరులో రూ. 72 లక్షలు, కృష్ణాలో రూ. 64 లక్షలు, నెల్లూరులో రూ.54 లక్షలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక అమెరికాలో 700kపైగా డాలర్లు అంటే.. 5.8 కోట్ల వరకు వసూలు చేసిందట.
ఇకపోతే చిత్రంలో బాలయ్యతో పాటు సినిమాలో శ్రీలీల మరో ప్రధాన పాత్ర పోషించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ చేశారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. తమన్ మ్యూజిక్ అందించారు. షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.
ఈ చిత్రం రివ్యూ విషయానికొస్తే.. బాలకృష్ణ - శ్రీలీల యాక్టింగ్, కథాంశం, డైలాగ్స్, ఎమోషన్స్, క్లైమాక్స్సీన్స్ హైలైట్‌గా నిలిచాయి. ప్రథమార్ధంలో కొన్ని సీన్స్ బలహీనతలుగా ఉన్నాయి. మొత్తంగా సినీ ప్రేక్షకులకు.. ఈ భగవంత్ కేసరి చాలా కాలం యాదుంటాడు అని రివ్యూలు ఇస్తున్నారు. ఫైనల్‌గా దసరి బరిలో విజేతగా నిలిచిందీ చిత్రం.