Begin typing your search above and press return to search.

యూఎస్ లో గామి హవా.. మాములుగా లేదు

అమెరికాలో గామి మూవీ క్వార్టర్ మిలియన్ డాలర్స్ (2 లక్షల 50 వేలు) మార్క్ ను క్రాస్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

By:  Tupaki Desk   |   9 March 2024 6:58 AM GMT
యూఎస్ లో గామి హవా.. మాములుగా లేదు
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన గామి సినిమా ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న విశ్వక్.. గామిలో అఘోర పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చౌందినీ చౌదరి, అభినయ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను విద్యాధర్ కగిత తెరకెక్కించారు. కార్తీక్ శబరీష్ క్రౌడ్ ఫండింగ్ తో ఈ మూవీని నిర్మించారు.

ప్రయోగాత్మక చిత్రమైన గామిని యూవీ క్రియేషన్స్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసింది. అయితే విడుదలకు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు మూవీపై మంచి అంచనాలు పెంచాయి. ఇక సినిమా కూడా ఫస్ట్ షో నుంచే మంచి టాక్ సంపాదించుకుంది. తక్కువ బడ్జెట్ లో ఓ రేంజ్ విజువల్స్ తో సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది గామి చిత్రం.

అయితే గామి మూవీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విశ్వక్ సేన్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. యూఎస్ లో స్ట్రాంగ్ వసూళ్లతో అదరగొడుతోంది. అమెరికాలో గామి మూవీ క్వార్టర్ మిలియన్ డాలర్స్ (2 లక్షల 50 వేలు) మార్క్ ను క్రాస్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇక వీకెండ్ వసూళ్లతో హాఫ్ మిలియన్ మార్క్ ను కూడా ఈ సినిమా ఈజీగా క్రాస్ చేయవచ్చని సినీ పండితులు చెబుతున్నారు. సినిమా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. విశ్వక్ సేన్ తన నటనతో అదరగొట్టారని అంటున్నారు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ విశ్వక్ అంటూ కొనియాడుతున్నారు.

స్టోరీ ఇదే..

అఘోర శంకర్ (విశ్వక్ సేన్) కు గతం గుర్తుండదు. మానవ స్పర్శను తట్టుకోలేని వ్యాధితో బాధపడుతుంటాడు. దీంతో తోటి అఘోరాలంతా ఆశ్రమం నుంచి వెలివేస్తారు. అప్పుడు తనను తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలు పెడతాడు. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలి పత్రాల్లో ఉందని తెలుసుకుంటాడు. దీంతో అక్కడికి వెళ్లేందుకు చాందినీ చౌదరితో కలిసి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.