Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్ 1000 కోట్లు కొడతాడా..?

RRR తర్వాత శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. గేమ్ చేంజర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ తో రాబోతుంది. ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

By:  Tupaki Desk   |   6 Aug 2023 7:26 AM GMT
గేమ్ చేంజర్ 1000 కోట్లు కొడతాడా..?
X

RRR తర్వాత శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. గేమ్ చేంజర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ తో రాబోతుంది. ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు తమిళ భాషల్లో లీడింగ్ యాక్టర్స్ ని ఈ సినిమాలో తీసుకున్నారు. గేమ్ చేంజర్ సినిమాపై శంకర్ పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా అవుట్ మీద చిత్ర యూనిట్ సాటిస్ఫైడ్ గా ఉందని తెలుస్తుంది.

ట్రిపుల్ ఆర్ తో పాన్ వరల్డ్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్ గ్లోబల్ స్టార్ గా పాపులర్ అయ్యాడు. RRR తర్వాత ఆచార్య ఫ్లాప్ అయినా ఆ ఎఫెక్ట్ ఏది పెద్దగా లేదు. గేమ్ చేంజర్ సినిమా శంకర్ చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ఈసారి టార్గెట్ మిస్ అవకూడదని శంకర్ ప్లాన్ చేశారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చరణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని భారీ టార్గెట్ ఫిక్స్ చేశారట.

తెలుస్తున్న సమాచారం ప్రకారం చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా 1000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారట. సినిమా రిలీజ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత నెల రోజుల ముందు నుంచే సినిమాను భారీగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. నేషనల్ మీడియాలో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తీసుకెళ్లాలని చూస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాపై చరణ్ కూడా నమ్మకంతో ఉన్నారని తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత బుచ్చి బాబుతో చరణ్ సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న చరణ్ ఇక మీదట తను చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే ప్లాన్ చేస్తున్నారు. శంకర్ గేమ్ చేంజర్ సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా సినిమా శంకర్ ని తిరిగి ఫాంలోకి తెస్తుందా లేదా అన్నది చూడాలి. టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఒక్కడే 1000 కోట్ల హీరో అయ్యాడు. ఇక ఇప్పుడు చరణ్ కూడా అదే టార్గెట్ తో వస్తున్నాడు. రాం చరణ్ తో పాటుగా ఎన్.టి.ఆర్ దేవర కూడా పెద్ద టార్గెట్ తోనే వస్తున్నట్టు తెలుస్తుంది. మరి చరణ్ గేమ్ చేంజర్ తో సత్తా చాటుతాడా లేదా అన్నది చూడాలి.