Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్: గం గం గణేశా.. ఫస్ట్ డే లెక్కలు ఇలా..

సినిమా తొలి రోజు రూ.1.82 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్లు వెల్లడించారు. వీకెండ్ లో ఈ మూవీ మంచి వసూళ్లు సాధించి అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 11:16 AM GMT
బాక్సాఫీస్: గం గం గణేశా.. ఫస్ట్ డే లెక్కలు ఇలా..
X

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ గం గం గణేశా. గత ఏడాది బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత ఆనంద్ చేసిన మూవీ కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా దర్శకుడు ఉదయ్ శెట్టి తెరకెక్కించిన ఈ మూవీ.. శుక్రవారమే రిలీజ్ అయింది. ఆనంద్‌ దేవరకొండ సరసన సినిమాలో నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్లుగా నటించారు.

ఈ మూవీతో వంశీ కారుమంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయమయ్యారు. గం గం గణేశా సినిమాను తన ఫ్రెండ్ కేదార్ సెలగంశెట్టితో కలిసి హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించారు. దాదాపు 400 థియేటర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఆనంద్ కూడా ఈ మూవీ కోసం బాగా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ బాడీ పిక్స్ కూడా షేర్ చేసి హైప్ క్రియేట్ చేశారు.

సినిమాలో కొత్తగా కనిపించిన ఆనంద్ దేవరకొండ తన యాక్టింగ్ తో అదరగొట్టారు. అయితే మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ వసూళ్ల వివరాలను మేకర్స్ రీసెంట్ గా ప్రకటించారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా తొలి రోజు రూ.1.82 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్లు వెల్లడించారు. వీకెండ్ లో ఈ మూవీ మంచి వసూళ్లు సాధించి అవకాశం ఉంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా.. ఈ మూవీకి గాను ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్‌ లో రూ.కోటి, రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. దీని ప్రకారం.. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.6 కోట్లు నమోదైంది. అంటే దాదాపు రూ.12 కోట్లు వసూలు చేయాలి.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఆనంద్ దేవరకొండ. చేసిన మూవీలు అన్నీ సక్సెస్ కాకున్నా.. నటుడిగా మాత్రం మంచి పేరు దక్కించుకున్నారు. వరుస చిత్రాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి కొత్త మూవీలతో ఆనంద్ దేవరకొండ ఎలాంటి హిట్లు కొడతారో వెయిట్ అండ్ సీ.